ఏలూరు ఎంపీ అభ్యర్థి గా ఘంటా ప్రసాద్....?

Published: Tuesday December 12, 2023

నియోజకవర్గ  ఇంచార్జ్ మార్పు వైసీపీలో కాక పుట్టిస్తుంది అసంతృప్తులకు  సర్దు చెబుతూ మరిన్ని మార్పులకు అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ తాను ఎంపీగా పోటీ చేయనని బహిరంగంగానే చెప్పడంతో అధిష్టానం ఏలూరు జిల్లాలో సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన బీసీ నేత ఘంటా ప్రసాద్ కి సీటు  కేటాయించే అవకాశం ఉందని వైసిపి వర్గంలో జోరుగా వినిపిస్తుంది పార్టీ కష్ట సమయాల్లో కార్యకర్తలకు అండగా ఉన్న ఘంటా ప్రసాద్,  పూర్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంగుటూరు సీటు కేటాయిస్తామని స్వయంగా నారా లోకేష్  చెప్పిన తాను జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. ప్రస్తుతం ఆయన పేరు ఏలూరు ఎంపీగా పరిశీలనలో ఉండడంతో కార్యకర్తలు ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.