నేడు సీబీఐ ముందుకు అవినాశ్‌ రెడ్డి

Published: Friday May 19, 2023

జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో శుక్రవారం చేపట్టే సీబీఐ దర్యాప్తు అత్యంత కీలకంగా మారనుంది. ఈ కేసు నిందితుల్లో ఒకరైన వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరు కానుండటమే దీనికి కారణం. ఆయన అరెస్టు తప్పదని సీబీఐ అధికారులు ఇప్పటికే కోర్టుకు తెలిపిన నేపథ్యంలో.. అవినాశ్‌ విచారణ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది ‘నా పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. ఇంతలోనే సీబీఐ నన్ను విచారణకు పిలిచింది. సీబీఐ విచారణ నుంచి నాకు రక్షణ కల్పించాలి’’ అని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, అక్కడా ఆయనకు చుక్కెదురయింది. మరోవైపు, వివేకా హత్య కేసు దర్యాప్తు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ గత కొద్ది రోజులుగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి విచారణ అత్యంత కీలకంగా మారనుంది. సీబీఐ నోటీసుల మేరకు అవినాశ్‌రెడ్డి విచారణకు హాజరవుతారా...... మరేదైనా కారణంతో గడువు కోరతారా.....విచారణకు హాజరైతే పరిస్థితి ఏమిటనేదానిపై ఉత్కంఠ నెలకొంది.