కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతాం - ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్

Published: Friday May 19, 2023

గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ యూజ్ లెస్ గవర్నమెంట్ నడుపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుంది. జగన్ సహా ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ దొంగలే. జగన్ మంత్రిమండలి అలీబాబా 40 దొంగలు లాగా తయారయ్యారు. సాధారణంగా రోడ్ల మీద గుంతలు ఉంటాయి, ఏపీలో మాత్రం గుంతల మీద రోడ్లు ఉన్నాయి. ఏపీ కంటే యూపీ, అస్సాం రోడ్లు బావున్నాయి. ఏపీలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా నడుస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, చివరికి బంగ్లాదేశ్ లో గంజాయి దొరికినా అది ఏపీ నుండే సప్లై అవుతుంది