అమరావతిలో అంబటి రాయుడు

Published: Monday July 31, 2023

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అమరావతిలో పర్యటించారు. ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల వివాదం కొనసాగుతోంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని స్థానిక జేఏసీ ఆందోళన చేస్తోంది. ప్రస్తుతం అమరావతి కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీఎం జగన్ నిర్ణయాలను ప్రశంసిస్తున్న అంబటి రాయుడు..కొద్ది రోజులుగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అందులో భాగంగా అమరావతికి వెళ్లిన అంబటి రాయుడు పర్యటనలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

స్థానిక వైసీపీ నేతల విజ్జప్తి మేరకు అంబటి రాయుడు అమరావతికి వచ్చారు. వెలగపూడిలోని వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్లారు. అయితే.. విషయం తెలుసుకొని అమరావతి రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో సీన్ అంతా ఆసక్తికరంగా మారిపోయింది. అమరావతికి సంఘీభావం తెలుపాల్సిందిగా అంబటి రాయుడును కోరారు. అంబటి రాయుడు ఆడిన ప్రతి మ్యాచ్‌లో సెంచరి కొట్టాలని తామంతా కోరుకున్నామని తెలిపారు. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని కోరారు. జై అమరావతి అనాలని అడిగారు.