ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి

Published: Thursday April 13, 2023
ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి

*బిజెపి ఎస్సిమోర్చా ఆధ్వర్యంలో డా బాబా సాహెబ్ అంబెడ్కర్  జయంతి ఘనంగా నిర్వహించాలి పందిర్ల ప్రసాద్ ఎస్సిమోర్చా రంగారెడ్డి జిల్లా ప్రభారి*

భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా పదాధికారుల సమావేశం తుర్కయంజాల్ మున్సిపాలిటీ రొక్కం సత్తిరెడ్డి గార్డెన్ లో జిల్లా ఎస్సీమోర్చా అధ్యక్షులు బచ్చిగళ్ళ రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా ప్రబారి శ్రీ పందిళ్ళ ప్రసాద్ గారు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం లాగే జిల్లాలోని అన్ని మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ కేంద్రాలలో ఘనంగా జరపాలని ఆయన పిలుపునిచ్చారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీలోకి ఎస్సి నాయకులను కార్యకర్తలను అనేకమంది తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి  ప్రతి నాయకుడు,కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సిమోర్చా సోషల్ మీడియా కన్వీనర్  కొండ్రు పురుషోత్తం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెవ్వ శ్రవణ్ కుమార్, గడ్డం వెంకటేష్  కొండూరు మనోహర్ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి,  ఎస్సిమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పల్లేటి జగన్, భీమ్ రాజ్  జిల్లా కార్యదర్శి కుంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.