ఘనంగా రియల్ హీరో సోను సూద్ పుట్టినరోజు వేడుకలు

Published: Monday August 01, 2022

బోనకల్ ,జూలై 31 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గార్లపాడు గ్రామంలో రియల్ హీరో సోను సూద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోను సూద్ అభిమాని గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి 49వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుర్రం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పంజాబ్ లోని మోగ పట్టణంలో జన్మించిన సోనూసూద్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని లాక్ డౌన్ సమయంలో రియల్ హీరోగా మారాడని, వేల మంది వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపించి రియల్ హీరోగా మారాడని, సొంత డబ్బుతో వారిని ఇళ్లకు పంపించి ప్రశంసలు పొందారని ప్రభుత్వాలు చేయలేని పనులను చేసి అందరి మనసులో చోటు సంపాదించుకున్నారని అన్నారు. వారి పుట్టినరోజు తో పాటు వారి పిఏ హరీష్ పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, రామాపురం ఎంపీటీసీ ముక్కపాటి అప్పారావు, గార్లపాడు వైస్ సర్పంచ్ తాతా లక్ష్మీనారాయణ, అభిమానులు కనకపుడి కోటి,గంధం పుల్లయ్య, వంశి తదితరులు పాల్గొన్నారు.