బొబ్బిళ్ళ సుశీలమ్మ వర్ధంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల సేవా ఆధ్వర్యంలో షుగర్-బి.పి.

Published: Saturday September 24, 2022

చౌటుప్పల్, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): బొబ్బిళ్ళ సుశీలమ్మ రామచంద్రం వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ పురపాలక పరిధిలోని 12వ వార్డులో హెల్త్ క్యాంపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డులోని ప్రజలకు బిపి షుగర్ చెకప్ లు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం లైన్స్ క్లబ్ చౌటుప్పల్ అధ్యక్షులు కాసుల వెంకటేష్ మాట్లాడుతూ చౌటుప్పల్ పురపాలక పరిధిలోని 20 వార్డులలో లైన్స్ క్లబ్ చౌటుప్పల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహించామని ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్ మరియు లయన్స్ క్లబ్ నాయకులు దాచేపల్లి ప్రకాష్ గుప్తా, కటకం ప్రశాంత్, బొబ్బిళ్ళ మురళి, పోలోజు శ్రీనివాస్ చారి, సత్యనారాయణ చారి, వనం రాజు, కామిశెట్టి చంద్రశేఖర్, అయ్యాడపు ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.