మునుగోడులో ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయంతో సారుపాకలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల అంబరాన్న

Published: Monday November 07, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
మునుగోడు ఉప ఎన్నికలలో బిఆర్ఎస్  పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగినది. మునుగోడు ఉప ఎన్నికలలో  బిఆర్ఎస్   ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి 11666 ఓట్ల  భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా  పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విజయోత్సవ ర్యాలీ, టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకోని భారీ ఎత్తున అన్ని పార్టీ కార్యాలయ ఎదుట ఘనంగా సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగానే బూర్గంపాడు మండలం సారపాక పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బిఆర్ఎస్ పార్టీ విజయోత్సవ ర్యాలీని సారపాక పురవీధుల్లో తిరుగుతూ ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 18  వేల కోట్ల కాంట్రాక్ట్  కోసమే ఉప ఎన్నికలు వచ్చేలా చేశారని దానికి చెంపపెట్టుగా ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి అఖండ మెజార్టీని ఇచ్చి బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పిందని వారి ఈ సందర్భంగా చెప్పారు. ఈ సంబరాలలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ,వర్కింగ్ ప్రెసిడెంట్ జనగం జగదీష్, సీనియర్ నాయకులు కామిరెడ్డి కొండారెడ్డి ,మరియు బాలాజీ, సాయిబాబా, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టౌన్ ప్రెసిడెంట్ శ్రీను, బాలి శ్రీహరి, మిగతా కార్యకర్తలు పార్టీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  ఆదివారంనాడు పార్టీ శ్రేణులకు ఆదేశించడం జరిగింది