ఏట్ల ఎర్రవల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం : జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి

Published: Friday December 09, 2022
 వెనుకబడిన ఏట్ల ఎర్రవల్లి పంచాయితీలో మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని  షాబాద్  జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు.
గురువారం టిఆర్ఎస్ నాయకులతో కలిసి ఏటి రవళి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మరమ్మత్తులకు కోసం ఎదురుచూస్తున్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించారు.
అంగన్వాడీ పిల్లలకు చాక్లెట్ల కోసం వెయ్యి రూపాయలు ఇచ్చారు. అనంతరం మద్దూర్ కిష్టయ్య భూమి పొలం నుండి మూలమండ వాగు వరకు రూ. 7 లక్షల నిధులతో 
ఓపెన్ డ్రైనేజీ నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. గతంలో గ్రామ అభివృద్ధికి అందించిన నిధులను గుర్తు చేశారు. అంగన్వాడి భవనంలో విద్యార్థులకు ఇబ్బందులు కలిగేలా ఉన్నా బండలను తొలగించి, కొత్తబండలు వేయిస్తామని మరమ్మత్తులు చేయిస్తామని అన్నారు. గతంలో సరిగ్గా నిర్మించనందున అంగన్ వాడి భవనంలో బండలు దిగి, గోడలకు బీటలు వారాయని గ్రామస్తులు వివరించారు. సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నక్క శ్రీనివాస్ గౌడ్, 
యూత్ అధ్యక్షుడు పీసరి సతీష్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ కీసరి సుమిత్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాణిక్య రెడ్డి, మాజీ సర్పంచ్ మద్దూర్ కిష్టయ్య, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అర్జున్ వార్డు సభ్యులు వెంకటయ్య , వినయ్ గౌడ్, జంగయ్య, భీమయ్య, శ్రీను, ఎల్లయ్య,సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.