ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన అమరజీవి మస్కు నరసింహ* *ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చే

Published: Thursday July 28, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధిబుధవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంట్నంలోనీ పాషా, నరహరి స్మారక కేంద్రంలో 2వ వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది. ఈ సంద్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కాడిగాళ్ళ భాస్కర్ మాట్లాడుతూ సిపిఎం పార్టీగా రంగారెడ్డి జిల్లాలో నిరంతరం పేద హక్కుల కోసం భూమి, భూక్తి, ఇండ్ల స్థలాలు, ఇండ్లు, ఉపాధి, ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, స్థానిక పరిశ్రమల్లో పనులు కల్పించాలని నిరంతరం శ్రమిస్తూ పోరాటాలు నిర్వహించడంలో కీలక పాత్రవహించారని గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది చట్టసభలలో ప్రజలలో సెరగని ముద్ర వేసుకొని తుది శ్వాస ఉన్నంతవరకు రైతు, కూలీలు, కార్మికుల హక్కులకై నిలబడిన వ్యక్తి  అన్నారు. కామ్రేడ్ మస్కు నరసింహ నిరుపేద కుటుంబంలో జన్మించి చిరునవ్వులతో పలకరిస్తూ విద్యార్థి,  యువజన నాయకుడిగా పని చేసి 2004 సంవత్సరంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ ప్రాంతంలోని ప్రజలు ఫ్లోరైడ్ వాటర్ సమస్య పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ వరకు వేలాది మందితో పాదయాత్ర చేసి కృష్ణ వాటర్ తెచ్చి ఫ్లోరైడ్ మహమ్మారిని దూరం చేశాడు. ఇరుకురోడ్లతో ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురై నాగార్జున సాగర్ రహదారిపై రోజు ప్రాణాలు కోల్పోతుంటే నియోజకవర్గ ప్రజల ప్రాణాలు కాపాడాలని ఫోర్ లైన్ రోడ్డు కోసం గున్ గల్ నుంచి పాదయాత్ర చేసి ఫోర్ లైన్ రోడ్డు వేయించి ప్రజల ప్రాణాలను కాపాడారు. ఇబ్రహీంపట్నంలోని పేద పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత దూరం కావద్దని పై చదువులు చదువుకోవాలని ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధించారు. భూ పోరాటాలు చేసి సాధించుకున్న భూములకు పట్టాలు ఇప్పించి వేలాది మందికి భూమిపై హక్కులు కల్పించాడు. 2006 సంవత్సరంలో  ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండ్ల స్థలాల కోసం ఇంజాపూర్ కట్టకింద ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేద ప్రజలకు అండగా నిలబడితే ఎమ్మెల్యే అని చూడకుండా పోలీసులు తాళ్లతో కట్టి జీపుల్లో పడేసి కొట్టిన పేదల పక్షాన నిలబడి శాసనసభలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పట్టుబడి, 2007 సంవత్సరంలో రామోజీ ఫిలిం సిటీ లో నాగన్ పల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకు నూర్ ఇంటి పట్టాలు ఇచ్చారు. బోంగ్లూర్ ఇందిరమ్మ కాలనీలో విలేకర్లకు ఇంటి స్థలాలు ఇచ్చారు. దండుమైలారం, మంగళ్ పల్లి, పోచారం, మంచాల, చౌదర్ పల్లి, చింతల్ల, మేడిపల్లి, తమలోని గూడ, కుర్మిద, మంతన్ గౌరెల్లి గ్రామాలలో వేలాది మందికి ఇంటి పట్టాలు ఇప్పిస్తే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఇంటి పట్టాలను ఇస్తే ఇల్లు కట్టిస్తామని పట్టాలు తీసుకొని నేటికి ఇల్లు కట్టించకపోగా జిల్లాలో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని 429 జీవోను తీసుకొచ్చారు. పేదలు పోరాడి సాధించుకున్న భూములను మళ్లీ తీసుకొని ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది పోరాడి సాధించుకున్న పేదలకు ఇల్లు కట్టించాలని, 429 జీవోను రద్దు చేసి ఇళ్ల స్థలాలు లేని ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు.
                      ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మధు సుదన్ రెడ్డి, పగడాల యాదయ్య, సామేల్, జగదీష్, జంగయ్య, నర్సింహా, శాంసుందర్, జగన్, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు...