కొవ్వూరులో ఉనికికాపాడుకోవడానికి తంటాలు పడుతున్న వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌

Published: Saturday June J, 2016

కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ కనమరుగు కాగా ప్రతిపక్ష వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి తంటాలు పడుతుంది. వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకులే ఉన్నా వారి మద్య సయోద్య లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించడంతో పార్టీ కేడర్‌కూడా నిస్థేజంగా ఉంటున్నారు. నియోజవర్గంలో 4సార్లు శాసనసభ్యునిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ నుండి వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీకి మారిన పెండ్యాల వెంకటకృష్ణారావు (కృష్ణబాబు) నియోజవర్గంపై దృష్ఠిపెట్టలేదనే చెప్పవచ్చును. ఆయన ప్రదాన అనుచరగణంలో ఒకరిద్దరు తప్ప ఎవరూ కృష్ణబాబు వెంట నడవలేదనే చెప్పవచ్చును. దీనికి తోడు కృష్ణబాబు నివాశం రాజమండ్రికి మారడంతో పార్టీలో పెద్దగా పట్టు సాదించలేదనే చెప్పవచ్చును. దీనికి తోడు నిడదవోలు నియోజకవర్గం నుండి కృష్ణబాబు అల్లుడు రాజీవ్‌కృష్ణ వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ నుండి ప్రాతినిద్యం వహించడంతో కృష్ణబాబు ప్రదానంగా అక్కడ దృష్టిసారించారు. నియోజకవర్గం ఇన్‌చార్జి తానేటి వనిత పార్టీ పిలుపులకు హాజరై వెళ్ళుతున్నారు. వనిత కూడా ఎన్నికల అనంతరం తన నివాశంను కొవ్వూరు నుండి రాజమండ్రికి మార్చారు. కొవ్వూరు పట్టణంలో మాజీ ఎం.ఎల్‌.సి., మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కోడూరి శివరామకృష్ణ తులసీ వర ప్రసాద్‌ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నా పార్టీ కార్యక్రమాలలో మాత్రం అంతంతమాత్రంగానే పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీకి వచ్చినా పార్టీలో ఆదినుండీ అంత ఉత్సాహాంగా లేరనే చెప్పవచ్చును. మరోక నాయకుడు పరిమి హరిచరణ్‌ మున్సిపల్‌ ఎన్నికలలో ఘోరపరాజయం తరువాత పార్టీ కార్యాక్రమాలలో అంతంతమాత్రంగానే పాల్గొంటున్నారు. మండల స్థాయి నాయకులు అయిన బండి పట్టాబిరామారావు, ముదునూరి నాగరాజు, కాకర్ల నారాయుడు, యండపల్లి రమేష్‌ బాబు, కొటారు అశోక్‌ తదితరులు పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న సందర్బాలు చాలా తక్కువనే చెప్పవచ్చును. ఈ పరిస్థితులలో వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గంలో మనుగడ కష్టమనే చెప్పవచ్చును. ముఖ్యంగా కార్యకర్తలకు బరోసా ఇచ్చే నాయకుడు కరువైనారు. రాష్ట్రంలోనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాదించడంతో గ్రామస్థాయి నుండి నియోజకవర్గం స్థాయి వరకూ వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాప్రతినిదులు లేకపోవడంతో పార్టీ కేడర్‌ నిస్థేజంగా మారిందనే చెప్పవచ్చును. 

ఎడిటర్‌: గోలి వెంకటరత్నం.