హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 1వ తరగతి ప్రవేశానికి గిరిజన విద్యార్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం

Published: Tuesday February 09, 2021

జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నారాయణరెడ్డి

మంచిర్యాల జిల్లా ప్రతినిధి,ఫిబ్రవరి 7, ప్రజాపాలన: 2021-22 విద్యా నంవత్సరానికి గాను బేగంపేట, రామాంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 1వ తరగతిలో ప్రవేశం కోసం గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 4 బాలురు, 2 బాలికలను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని అభ్యర్థుల తల్లిదండ్రులు వారి పిల్లల దరఖాస్తులు సంబంధిత ధృవీకరణ పత్రాలతో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయములో మార్చి 6వ తేదీ సాయంత్రం 5 గం॥ల లోపు సమర్పించాలని, దరఖాస్తుతో పాటు నంబంధిత ధృవపత్రాలు సక్రమంగా సమర్పించుకున్న విద్యార్థులు మార్చి 8వ తేదీ ఉదయం 11 గం॥లకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో లాటరీ పద్దతి ఎంపిక చేయడం జరుగుతుందని, ఇందుకు హాజరయ్యే వారు న్వంత ఖర్చులతో హాజరు కావాలని, నమూనా దరఖాస్తు ఫారములు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో లభిస్తాయని తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల వారికి లక్షా 50 వేల రూపాయలకు మించి ఉండరాదని, ఆదాయ ధృవపత్రము సంబంధిత తహశీల్దార్ చే మీ-సేవ ద్వారా పొంది ఉండాలని, విద్యార్థులు తేది : 01-06-2015 నుండి 31-05-2016 లోపు జన్మించిన వారై ఉండాలని, ఇట్టి ధృవపత్రము సంబంధిత మున్సిపల్ / కార్పొరేషన్, మున్సిపల్ బోర్డు / తహశిల్దార్ చే జారీ చేయబడి ఉండాలని విద్యార్థుల నివాస ధృవ పత్రము సంబంధిత తహశిల్దార్ చే జారీ చేసినదై ఉండాలని, పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు పాన్ పోర్ట్ సైజ్ ఫొటోలు (3), ఆదాయం, కులం, నివానం, జనన ధృవీకరణ షత్రాల ప్రతులు గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్ చేసి జత చేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల అభ్యర్థులు నద్వినియోగం చేసుకోవాలని తెలిపారు