చింతకాని కోచ్ ఫ్యాక్టరీ వెంటనే ఏర్పాటు చేయాలి

Published: Thursday January 21, 2021
*100 పడకల ఆసుపత్రి హామీ ఏమైయనది*..
 
*మధిర పట్టణంకు కేటాయించిన నిధులను ఎందుకు వెనుకకు వెళ్ళినాయీ*...
 
 
*రాణి రుద్రమ రెడ్డి*
*యువ తెలంగాణ పార్టీ  రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్*
*ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టబద్రుల శాసన మండలి అభ్యర్థి*
 
 
 
మధిర పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మరియు ప్రభుత్వ కార్యాలయలలో
యువ తెలంగాణ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్
ఖమ్మం_వరంగల్_ నల్గొండ పట్టబద్రుల శాసన మండలి అభ్యర్థి  రాణి రుద్రమ రెడ్డి ప్రచారం చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చింతకాని కోచ్ ఫ్యాక్టరీ   ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉద్యగావకాశాలు మెరుగయ్యేవి  అని అన్నారు. వెంటనే ప్రభుత్వం చింతకాని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు. ఎలక్షన్ల సమయంలో మధిర పట్టణానికి కేటాయించిన 15 కోట్ల నిధులు ప్రభుత్వం ఎందుకు వెనక్కు తీసుకుందో ఇక్కడి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు పిఆర్సి ని వెంటనే ఇవ్వాలని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు ప్రభుత్వాల వద్ద ప్రణాళికలు లేకుండా మాట్లాడటం చాలా విడ్డూరమన్నారు. మధుర పట్టణంలో వెంటనే  వంద పడకల ఆసుపత్రిని  చేయాలని అన్నారు.
 
     ఈ కార్యక్రమంలో యువతెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు కళింగ శేఖర్, అలవాల విష్ణు, తెలంగాణ ప్రైవేటే లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి రాజేశ్వర్, కంభంపాటి కిరణ్, గోపి, పవన్, ప్రదీప్, జీవన్, జగన్, చింటూ, గోపి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.