20వ డివిజన్ కార్పొరేటర్ ఇంటింటికి ఫీవర్ సర్వే

Published: Wednesday May 12, 2021
బాలపూర్, మే 11, ప్రజాపాలన ప్రతినిధి : గాయత్రీ నగర్ కాలనీలో యోగక్షేమాలు తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్. బాలపూర్ మండలం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ గాయత్రీ నగర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తో పాటు కలిసి స్థానిక కార్పొరేటర్ మద్ది సబిత రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.. కరోనా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించి, కాలనీ వాసులను అడిగి యోగక్షేమాలు తెల్సుకునారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లకు మందులు పంపిణీ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు మనోధైర్యం తో ఉండాలని జలుబు, దగ్గు, జరము, వచ్చినవారు జాగ్రత్తలతో పాటు మందులు తీసుకోవాలని చెప్పారు. అలాగే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని తగిన జాగ్రత్తలు పాటించాలని అత్యవసరం ఉంటేనే బయిటికి వెళ్ళాలని మాస్కులు పెట్టుకోవాలినీ, బౌతిక దూరం పాటించాలని, కార్పొరేషన్ కార్పొరేటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మద్ది సబిత రాజశేఖర్ రెడ్డి, బిజెపి మహిళ నాయకురాలు పద్మజ, ఆశ వర్కర్స్ సునీత, రజినీ, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.