అంబేద్కర్ ఒక్క నిమిషం జీవితం 100 ఏళ్ల పోరాటాలకు స్ఫూర్తినిస్తుంది: యువనేత బీపీ నాయక్

Published: Saturday April 15, 2023

*ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు*


*ఈ దేశం సమైక్యంగా సమున్నతంగా.. సమభావంగా శక్తిమంతంగాముందుకు సాగడానికి పద నిర్దేశం చేసిన దేశ భక్తుడు అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెర్కొని రాజు అన్నారు. ఇబ్రహీంపట్నం ముఖ్య కూడలిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.విద్యావేత్తగా.. మేధావిగా న్యాయకోవిదునిగాపాత్రికేయునిగా.. రాజకీయ నాయకునిగా. రాజ్యాంగ నిర్మాణ సారధిగా.. న్యాయశాఖామంత్రిగా ఆయన ఈ దేశానికీ చేసిన సేవలు వెలకట్టలేనివి అని కొనియాడారు. మహనీయుడు రూపొందించిన భారత రాజ్యాంగం ఆధారంగా నేటి మానవుడి మనుగడ ఆధారపడి ఉందని , నేడు పొందుతున్న పదవులు హక్కులు బాధ్యతలు మహనీయుడు కల్పించినవి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్పిఆర్డి నాయకులు బస్సు పాండురంగారెడ్డి, అంతటి మహేష్ గౌడ్్, వీరేశం, గాయకవాడ శివాాజీ, మంగల్ పల్లీ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.