ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి *ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందజేయడమే లక్ష్య

Published: Thursday January 12, 2023

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం చౌరస్తా, డాక్ బంగ్లా నందు టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు (బుధవారం  ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది, ఓమ్ని హాస్పిటల్ కొత్తపేట వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన దండెం రాంరెడ్డి , వైద్యం పరీక్షలకు వచ్చిన ప్రజలను దగ్గరుండి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ డాక్టర్లతో వారికి పరీక్షలు చేయించి మందులు ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని ప్రతి పేద వాడికి నాణ్యమైన ఉచిత వైద్యం అందజేయడం లక్ష్యంగా గత నెలలో పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ, పెద్ద అంబర్ పేట్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 4000 మందికి ఉచిత వైద్యం మరియు మందులు అందజేయడం జరిగింది, అదేవిధంగా ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం చౌరస్తా, డాక్ బంగ్లా లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు, ఉదయం 9 గం.లకు ప్రారంభించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ద్వారా ఇప్పటికే దాదాపు 3 వేల మందికి పైగా నిరుపేద ప్రజలకు ఉచిత వైద్యం మరియు మందులు, కళ్లద్దాలు అందజేయడం జరిగిందన్నారు, ఈరోజు సాయంత్రం 5 గం.ల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం కొనసాగనుంది, పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు, నియోజకవర్గం లోని ప్రజలందరి ఆరోగ్యమే మహాభాగ్యంగా ఈ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నానని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇదేవిధంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తానని దండెం రాంరెడ్డి  అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు.. డాక్టర్ సందీప్ రెడ్డి, డాక్టర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ గౌతమ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మేనేజర్, డాక్టర్ దేవేందర్, డాక్టర్ శిరీష, డాక్టర్ మమత, డాక్టర్ మహేష్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ హిమబిందు....
మరియు జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసీ శేకర్ గౌడ్ (మామ) , సీనియర్ నాయకులు లక్ష్మీపతి గౌడ్ , ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు దంపతులు, ఆదిభట్ల మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్ బాల్రాజ్ గౌడ్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు పండల రమేష్ గౌడ్ గారు, స్టేట్ కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గుండ్ల వెంకట్ రెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పండల శంకర్ , త్యాలపల్లి కృష్ణ, కప్పటి రఘు, సీనియర్ నాయకులు దిండి రాంరెడ్డి, బీసీ నాయకులు ఆడల బిక్షపతి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండల శివ గౌడ్, మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సౌండ్ శ్రీను, దేసారం జగన్ మోహన్ గౌడ్, శ్యామ్ ముదిరాజ్, హతిరామ్, కాంటెకర్ రాహుల్, రాఘవులు, మధు, రాంబాబు, వంశీ, టోనీ, వరుణ్ గౌడ్, అక్షయ్, యూత్ కాంగ్రెస్ శ్రీకాంత్, ఉపేందర్ మరియు పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, వృద్ధులు పాల్గొన్నారు.