ఈనెల 7న జిల్లాకు బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ** బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ **

Published: Friday January 06, 2023

ఆసిఫాబాద్ జిల్లా జనవరి 5 (ప్రజాపాలన, ప్రతినిధి) :  ఈనెల 7న ప్రేమల గార్డెన్, కాగజ్ నగర్ పటేల్ గార్డెన్లో, బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుందని, గురువారం విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు అసెంబ్లీలో బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహించే సమావేశంలో బూత్ కార్యకర్తలు అందరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆసిఫాబాద్ కు చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు జయరాజ్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సేర్ల మురళీధర్, అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షుడు ఈదులవాడ గణేష్, తిరుపతి, కార్తీక్, శ్రీధర్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.