ఎంపీ అభ్య‌ర్థుల వేట‌లో వైసీపి..!!ఆశావ‌హుల్లో పెరుగుతున్న ఉత్కంఠ‌..!!

Published: Friday December 28, 2018

పోటీ చేసే ఎంపీ అభ్య‌ర్థులు లేరు.! కానీ 25స్థానాల్లో గెలుస్తామంటున్న వైసీపి..!!స‌గానికి స‌గం నియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్థ‌లు క‌రువు..!
కోస్తాంద్ర‌లోలో కొసాగుతున్న ఉత్కంఠ‌. ఎంపీ అభ్య‌ర్థుల వేట‌లో వైసీపి.!ఆశావ‌హుల్లో పెరుగుతున్న ఉత్కంఠ‌.
 రాజమండ్రి నుంచి మరగాని భారత్
వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తే విభజన హామీలు సాధిస్తామని ఏపి సీయం చంద్రబాబు అంటున్నారు. మరో వైపు ప్రతిపక్షనేత జగన్మోహ‌న్ రెడ్డి సైతం 25 మేమే గెలుస్తాం, ప్రత్యేక హోదా రాష్ట్రానికి తెస్తామని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పుకొస్తున్నారు. అయితే వైసిపి కి వాస్తంగా ఇరవై సీట్లు గెలిచే సామ‌ర్థ్యం ఉందా అనే అంశం పై లోతైన చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచింది. వారి లో బుట్ట రేణుక,నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీ పార్టీ లో చేరారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత వైసీపీ కి రాజీనామా చేశారు. మిగిలిన ఐదుగురు ఎంపీ లు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశారు.ప్రస్తుతం వైసీపీ తరుపున గెలిచి పదవులకు రాజీనామా చేసిన ఐదుగురికి వచ్చే ఎన్నికల్లో జగన్ సిటు ఇచ్చే అవకాశం ఉంది. ఐతే మిగిలిన ఇరవై ఎంపీ స్థానాలకు అభ్యర్థులని ఖరారు చేయాల్సి వుంది. ఒక్క కడప జిల్లా మినహా మరెక్కడ ఎంపీ సీట్ల పై స్పష్టత లేదు. కొన్ని చోట్ల ఎంపీ నియోజక వర్గాలకు కో ఆర్డినెటర్లు ప్రకటించినా చివరి వరకు ఎంత మంది కి సీటు దక్కుతుందో ఇప్పుడే చెప్పలేమని పార్టీ వర్గాలు అంటున్నాయి. క‌ర్నూలు జిల్లాలో ఎంపీ సిటు తో పాటు, నంద్యాల కి అభ్యర్థి ఖరారు కాలేదు. ఇక అనంతపురం నుంచి తలారి రంగయ్య కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నా అదిష్టానం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఇక హిందూపురం ఎంపీ అభ్య‌ర్థి ని ప్రక‌టించాల్సి ఉంది.తిరుపతి ఎంపీ గా మాజీ ఎంపీ వరప్రసాద్ కి టికెట్ ఖాయం కాగా, చిత్తూరు ఎంపీ ఎవరనేది పార్టీ అదినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇంత వరకు నిర్ణ‌యించ‌లేదు. నెల్లూరు ఎంపీ గా మేకపాటి కి, ప్రకాశం ఎంపీగా వైపి సుబ్బారెడ్డి కి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ నేతలు చేబుతున్నారు. రాజధాని జిల్లా అయిన గుంటూరు అభ్యర్తి గా కిలారి రోశయ్య, నరసరావుపేట అభ్య‌ర్టీ గా లావు శ్రీ కృష్ణ దేవరాయలు బాధ్యతలు నిర్వ హిస్తున్నారు . ఈ నియోజక వర్గాల్లో చివరి నిమిషంలో అభ్యర్థులు మారే ఛాన్స్ ఉందని పార్టీ లో ప్రచారం జరుగుతోంది. బాపట్ల ఎంపి సిటు పై జగన్ ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి అభ్యర్తి ఎవ‌రో కూడా స్ప‌ష్ట‌త లేదు.మచిలీపట్నం అభ్యర్థిగా మాజీ ఎంపీ బాలశౌరి పేరుని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి కోటగిరి శ్రీధర్ ఎంపీ అభ్యర్థిగా పని చేస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ స్థానానికి అభ్య‌ర్థి ఖారారు కావాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి నుంచి మరగాని భారత్ కి టికెట్ ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అయితే కాకినాడ, అమలాపురం నియోజక వర్గాలకు అభ్యర్థులు లేరు. ఉత్తరాంద్ర లోని ఐదు ఎంపీ స్థానాల కు జగన్ ఇంకా అభ్యర్థులని ప్రకటించక పోవడంతో ఎవరు పోటీ లో ఉంటారో అనే అంశం పై గంత‌ర‌గోళం నెల‌కొంది. విలైనంత తోంద‌ర‌గా ఎంపీ ఆభ్య‌ర్ధుల‌ని ప్ర‌క‌టించాల‌ని లేదంటే, వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని పార్టీ నేత‌లు ఆభిప్రాయ ప‌డుతున్న‌టు తెలుస్తోంది.

,మీ mobil లో google app store నుండి kovvurnews app downlode చేసుకోండి