విత్తనాలను దమ్ములో వెదజల్లే పద్ధతిపై క్షేత్రస్థాయిలో ప్రదర్శన కార్యక్రమం

Published: Thursday August 25, 2022
బోనకల్, ఆగస్టు 24 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రాయన్నపేట గ్రామంలో బుధవారం వరి విత్తనాలను నేరుగా దమ్ము లో వెదజల్లే పద్దతి పై  వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో) నాగినేని నాగసాయి క్షేత్ర స్థాయి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అలాగే రైతులకు ఈ పద్ధతి యొక్క ఉపయోగాలను వివరించడం జరిగింది.ఈ వెదజల్లే పద్దతి లో సాగు చేయడం వలన కూలీ ఖర్చు, నారు ఖర్చు, సమయాన్ని అధిగమించవచ్చుననీ, ఈ పద్దతిలో కేవలం 8 నుండి 10 కేజీల విత్తనం సరిపోతుందనీ, విత్తన ఖర్చు తగ్గించవచ్చున నీ,ఈ విధానంలో సాగు చేయడం ద్వారా రైతులకు నారుమడి కి అయ్యే ఖర్చు తగ్గుతుంది, నీటి వినియోగాన్ని 30-35% శాతాన్ని తగ్గించవచ్చునని, 10 నుంచి 15  రోజుల ముందుగా కోతకు వస్తుంది.సుమారు ఎకరానికి 6000 నుండి 8000 వరుకు ఖర్చు ఆదా అవుతుందనీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు తూము రోశయ్య తదితరులు పాల్గొన్నారు.