విద్యార్థుల్లో అభ్యసనా సామర్ధ్యాల పెంపుకు కృషి చేయాలి

Published: Thursday August 04, 2022

మధిర ఆగస్టు 3 ప్రజాపాలన ప్రతినిధి విద్యార్థుల్లో అభ్యాసనా సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు ఉపాధ్యాయు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య సూచించారు. బుధవారం మధిర హరిజనవాడ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న రెండో విడత తొలిమెట్టు శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తొలి మెట్టు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని ఆగస్టు 16 నుండి పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఆయన అన్నారు. చిత్తశుద్ధితో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేసినట్లయితే విద్యార్థుల్లో సామర్ధ్యాలను మరింతగా వెలికితీయవచ్చని ఆయన అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి చదవడం, రాయడం రావాలని గణితం, ఇంగ్లీష్ లో కూడా విద్యార్థులు బాగా మెరుగుపడేట్లు ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ హరిజనవాడ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయిని విజయశ్రీ రిసోర్స్ పర్సన్స్ కమాల్ కళావతి సునీత ప్రాథమికోన్నత, ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.