ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పోషకాలు

Published: Thursday July 21, 2016

 

1. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేడ్స్, క్రొవ్వు పదార్ధాలు, ఐరన్, విటమిన్-సి తో కూడిన పదార్ధాలని ఎక్కువగా తీసుకోవాలి. ఇలా తీసుకోవటం తల్లికీ, బిడ్డకీ క్షేమం.
2. ధాన్యాలు అంటే పప్పులు, పప్పు ధాన్యాలు, గింజలు చక్కని శక్తిని ఇచ్చే పదార్ధాలు. మాంసం తినని వారు వీటిల్ని తినటం వల్ల ఆ శక్తి చేకూరుతుంది.
3. కూరగాయలు ఫైబర్, విటమిన్స్, కాల్షియం, మినరల్స్ ని ఇస్తాయి. వీటిని తినటం మంచిది.
4. మాంసం, చేపలు చాలా ప్రోటీన్లను ఇస్తాయి.
5. మంచి నీరు, పండ్ల రసాలు శరీరానికి కావల్సిన శక్తినివ్వటమే కాక గర్భిణీ స్త్రీకి కావాల్సినంత బలాన్నిస్తాయి.
6. ఒక మంచి క్రొవ్వు లేని నూనెలంటే అవి శాఖాహార నూనెలే. ఎందుకంటే వీటిలో ఎక్కువ క్రొవ్వు ఉండదు కాబట్టి.
7. చేప అదీ పండుగప్ప అంటే సాల్మన్ చేప ఇది ఒమేగా-3 క్రొవ్వు పదార్ధాలను ఇస్తుంది. ఇది గర్భస్థ శిశువుకు చాలా శక్తినిస్తుంది.
8. బీన్స్-ఇవి చాలా రకాలుగా ప్రెగ్నెన్సీలో ఉపకరిస్తాయి. వీటిలో ఫోలేట్, ఐరన్, కాల్షియం, జింక్ ఉంటాయి.
9. చిలగడదుంపల్లో విటమి-సి, ఫోలేట్, ఫైబర్ ఉంటాయి.
10. పాప్ కార్న్, ధాన్యాలు చాలా చక్కని పోషకాలని కలిగి ఉంటాయి. వీటిల్లో ఉండే విటమిన్-ఇ, సెలీనియం, ఫైటోన్యూట్రియెంట్స్ సెల్స్ ని కాపాడతాయి. అదేవిధంగా మరో ధాన్య రకమైన ఓట్మీల్ లో చాలా రకాలైన పోషకాలు అత్యధికంగా ఉంటాయి.
11. వాల్నట్స్ ఒమేగా-3 చెట్టు ఆధారితమైన సహజసిధ్ధలక్షణాలున్న పోషకాలు.
12. పెరుగు ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి చాలా చక్కగా ఏ రకమైన సమస్యలు రాకుండా చేస్తుంది. దీనిలో కాల్షియం తల్లిని కాపాడటమే కాక బిడ్డ ఎముకల ఎదుగుదలని ప్రేరేపిస్తుంది.
13. చాలా పచ్చని కూరగాయల్లో చలా చక్కని పౌష్టికాలు, విటమిన్లు, విటమిన్,ఎ,సి,కె ఉంటాయి.
14. మాంసం-దీనిలో చాలా రకాలైన మాంసకృత్తులూ, క్రొవ్వు పదార్ధాలు ఉంటాయి. మాంసం తినటం వల్ల బిడ్డ ఎదుగుదల చక్కగా ఉంటుంది.
15. పండ్లు తినటం ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంచిది. లేదా జ్యూస్లు త్రాగటం కూడా చాలా మంచిది. ఎందుకంటే వీటిలో చాలారకాలైన విటమిన్లు ఉంటాయి. ఆరెంజ్, యాపిల్, మామిడి మొదలగునవి తినటం చాలా మంచిది.

16. అరటిపందు పొటాషియం ను కలిగి ఉంటుంది. అంతేకాక త్వరగా శక్తి పొందాలంటే అరటి పండే తినాలి. ముఖ్యంగా బిడ్డ కు ఎప్పటికప్పుడు శక్తి అందాలంటే ఇది తినాలి. దీనిని స్లైసెస్ గా చేసుకుని పెరుగులోనూ, బెర్రీలలోను, ఐస్ లోనూ, ఆరెంజ్ జ్యూస్ లోనూ వాడాలి.
17. డ్రైడ్ ఫ్రూట్స్ అంటే ఎండు పండ్లు ఉదాహరణకు కిస్మిస్, ఖర్జూరం లాంటివి తినటం చాలా చాలా మంచిది.
18. అవకాడోలు తింటే ఎంతో చక్కగా బిడ్డ ఎదుగుతుంది. దీనిలో ఫోలిక్ యాసిడ్, పొటాషియం, విటమిన్-బీ-6 ఉంటాయి. ఇవి బిడ్డ నాడీవ్యవస్తకూ, మెదడు ఎదుగుదలకూ దోహదం చేస్తాయి.
19. మామిడి పండ్లు విటమిన్ ఎ,సి,బి-6 ని కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని తింటే మంచిది.
20. ఎర్ర మిరియాలల్లో విటమిన్ ఎ, సి, బి- 6 పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు తినే డిషెస్ లో దీన్ని వేసుకుని తింటే చాలా మంచిది.
పైన తెలిపిన ఆహారపదార్ధాలన్ని చాలా పోషకాలతో కూడినవి. వీటిని ప్రెగ్నెన్సీ సమయంలో తినటం చాలా మంచిది.