వైయస్సార్ పాలనలో రాష్ట్రం సుభిక్షం

Published: Saturday July 09, 2022
రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కాంగ్రెస్ కండువా కప్పి నివాళులర్పించిన మల్లు నందిని*మధిర జులై 8 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలోకాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి ఐన వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని పేర్కొన్నారు. శుక్రవారం మధిర వైయస్సార్ చౌరస్తాలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె కాంగ్రెస్ కండువా కప్పి అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. దేశంలోనే తొలిసారి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కిందన్నారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించారని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించారని, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారని, పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఉచిత వైద్యాన్ని అందించారని, 108, 104 లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్ కి దక్కిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ మిర్యాల రమణగుప్త కౌన్సిలర్ కోనా ధని కుమార్ పారుపల్లి విజయ్ కాజీ పురం వైస్ ప్రెసిడెంట్ ఆయుషా కమల్ ధార బాలరాజు కర్నాటి రామారావు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area