బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు సద్వినియోగించుకోండి బిపీ, షుగర్ క్యాంపు విజయవంతం

Published: Monday July 04, 2022
బోనకల్, జులై 3 ప్రజా పాలన ప్రతినిధి: బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ వైద్య సేవలు మండల ప్రజలు సద్వినియోగించుకోవాలని ట్రస్ట్ సభ్యులు తూము రోషన్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని మేఘ శ్రీ హాస్పిటల్ నందు దళిత, పేద ప్రజల ఆశాజ్యోతి, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నాయకుడు అమరజీవి తూము ప్రకాశరావు జ్ఞాపకార్థం, బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ప్రతి నెల మొదటి ఆదివారం బీపీ, షుగర్, కంటి, దంత ప్రత్యేక క్యాంపును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో సుమారు 20 నెలలుగా బిపీ, షుగర్ పేషంట్లుకు నిర్వీరామంగా నిపుణులైన వైద్యులచే వైద్య
సేవలు నిర్వహించి రూ. 100 కే నెలకు సరిపడ నాణ్యమైన మందులు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రత్యేక క్యాంపును బీపీ, షుగర్ రోగులు తప్పనిసరిగా సద్వియోగించుకోని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ క్యాంపులో మేఘ శ్రీ హాస్పిటల్ జనరల్ వైద్యులు లక్కబత్తిని గంగాధర్ గుప్తా, దంత వైద్య నిపుణులు సోమనపల్లి ఉదయకిరణ్ లు వైద్యసేవలు అందించగా క్యాంపు నిర్వాహాకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్నాద్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీడబ్ల్యూఏ టిఎస్ జిల్లా అధ్యక్షులు బొమ్మినేని కొండలరావు, సిపిఐ నాయకులు ఏలూరి పూర్ణచంద్, బీజేపీ నాయకులు ఏనుగు సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు.