అన్నారుగూడెంలో పల్లెప్రగతి శ్రమదానం.

Published: Thursday June 16, 2022
 అవగాహన కల్పించిన సర్పంచ్ మారెళ్ల మమత..
 
తల్లాడ, జూన్ 15 (ప్రజాపాలన న్యూస్):
 
 *తల్లాడ మండలంలోని అన్నారు గూడెం గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతిలో భాగంగా బుధవారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మారెళ్ల మమత ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీగా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాధులు సోకకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అనంతరం శ్రమదానంలో భాగంగా పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో  పంచాయతీరాజ్ ఏఈ అశోక్, ఎంపీటీసీ గోవిందు విజయమ్మ, సెక్రటరీ వేణు, ఉపసర్పంచ్ గోవిందు భాగ్యమ్మ, వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు