కెసిఆర్ పథకాలన్నీ మోస పూరిత పథకాలే : వైఎస్సార్ టీ పి అధ్యక్షురాలు వైయస్ షర్మిల

Published: Saturday June 11, 2022

 

వైఎస్ఆర్ తన పథకాలతో ప్రజల హృదయాల్లో బతికి ఉన్నారు
 
బోనకల్, జూన్ 10 ప్రజా పాలన ప్రతినిధి: సీఎం కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెండుసార్లు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. మండల పరిధిలోని రాపల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాలలో శుక్రవారం వైఎస్ షర్మిల పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. రాపల్లి గ్రామంలో కొద్దిసేపు పొలములో అరక అనే రైతు లాగా పనిచేస్తూ ఆయా గ్రామాల మహిళలు పూలవర్షం తో ఆమెకు ఘనస్వాగతం పలికారు. ప్రతి ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు నడిచారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ సీఎం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా ఉండాలని కెసిఆర్ లాగా ఉంటే ప్రజలు నమ్మరని, ప్రజల ప్రతి గుండెను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలు అలుముకొని ఉన్నాయన్నారు. తెలంగాణ సీఎంగా కెసిఆర్ నిత్యం మాయమాటలతో ప్రజలను మభ్య పెడుతూ కుటుంబ పాలన చేస్తున్నాడని విమర్శించారు. కెసిఆర్ పథకాలన్ని మోసపూరితవేనని మండిపడ్డారు. మోసపూరిత వాగ్దానాలు మోసపు పథకాల నుంచి ప్రజలను కాపాడటం కోసమే తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం, పెన్షన్లు, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ, రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని విమర్శించారు.వైఎస్సార్ సంక్షేమం పథకాల అమలు కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రారంభించినట్లు ఆమె అన్నారు. తాను అధికారంలోకి వస్తే వైఎస్సార్ సంక్షేమ పథకాలను అన్ని అమలు చేస్తానని, వైయస్సార్ బిడ్డగా తమ గుండెల్లో ఉంచుకొని తనను నమ్మాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజలే ఇవ్వాలని కోరుతూ, రాష్ట్రంలో వైఎస్సార్ పాలన తెచ్చుకుంటే తెలంగాణ ప్రజల కష్టాలు పోతాయని లేక పోతే రాష్ట్రం బాగుపడదని, కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ది లేదని, అన్ని పథకాలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని దీనికంతటికీ కెసిఆర్ చేతగాని పాలనేనని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైయస్సార్ పాలన వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య తీర్చాలంటే కెసిఆర్ వల్ల కాదని ఆమె మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్కినేని సురేంద్రబాబు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గడుపల్లి కవిత, మధిర నియోజకవర్గ ఇన్చార్జి దొంతమాల కిషోర్ కుమార్, పాదయాత్ర అబ్జర్వర్ నాడెం శాంతి కుమార్, నియోజకవర్గం పార్టీ అధ్యక్షులు ఎన్నం కోటారెడ్డి, ఇరుగు జానేసు, వాకా వీరారెడ్డి, సామినేని రవికుమార్, ఎర్ర గొర్ల సత్యనారాయణ, పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ బోనకల్ మండల అధ్యక్షుడు షేక్ మౌలాలి, మధిర నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 
 
 
టిఆర్ఎస్ జిల్లా నాయకులు తిరుమల రావు సంఘీభావం:  
 

మండల పరిధిలోని రాపల్లి గ్రామ సర్పంచ్ టిఆర్ఎస్ జిల్లా నాయకులు మందడపు తిరుమల రావు రాపల్లి గ్రామంలో వైయస్ షర్మిల ను కలిసి పాదయాత్ర కు సంఘీభావం తెలిపారు. తిరుమల రావు తో పాటు మరి కొందరు టిఆర్ఎస్ నాయకులు కూడా వైఎస్ షర్మిల పాదయాత్ర కు సంఘీభావం తెలిపారు. రాపల్లి బహిరంగసభలో వైయస్ షర్మిల కెసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.వైఎస్ఆర్ తన పథకాలతో ప్రజల హృదయాల్లో బతికి ఉన్నారు