బాలల సంరక్షణ కొరకు కేంద్రం ప్రత్యేక చేయూత

Published: Tuesday May 31, 2022
ప్రధానమంత్రి నరేంద్రమోదీ
 
మంచిర్యాల బ్యూరో, మే30, ప్రజాపాలన :
 
కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంరక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చేయూత అందిస్తుందని దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పి.ఎం. కేర్స్ ఫర్ చిల్డ్రన్ లబ్దిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. కొవిడ్-19 విపత్కర పరిస్థితులలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంరక్షణ, భవిష్యత్తు కొరకు భరోసా కల్పించేందుకు గాను ప్రతి పి.ఎం. కేర్స్ ఫర్ చిల్డ్రన్ లబ్దిదారుల సంబంధిత పోస్టాఫీన్ ఖాతాలో 10 లక్షల రూపాయలు ఎఫ్.డి. చేయడం జరిగిందని తెలిపారు.. ఈ మొత్తంపై వడ్డీని 18 సం||లు నిండిన తరువాత 23 సం॥లు నిండే వరకు వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. 23 సం॥లు నిండిన అనంతరం నదరు లబ్దిదారుల ఎఫ్.బి. ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. 10 లక్షల రూపాయల బెనిఫిట్తో పాటు, 5 లక్షల రూపాయల విలువైన పి.ఎం.జె.ఎ.వై. ఆరోగ్యకార్డు, ప్రధాని లబ్ధిదారులకు వ్రాసిన లేఖ, ధృవపత్రాలను అందించారు. మంచిర్యాల జిల్లాలో గుర్తించిన 6 మంది లబ్దిదారులకు బాలల సంరక్షణ విభాగం, డబ్ల్యు.డి. & డి.డబ్ల్యు. ద్వారా అత్యవసర అవసరాలకు అధికారులను సంప్రదిం  చేందుకు గాను ఒక మొబైల్ ఫోన్, నిత్యావసర సరుకులను జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి లబ్దిదారులకు బెనిఫిట్ కిట్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు అందించిన మొబైల్ ఫోన్ ను వినియోగించి అత్యవసర అవసరాలకు సంబంధిత అధికారులను సంప్రదించా  లని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా సంక్షేమాధికారి ఉమాదేవి. డి.సి.పి.ఓ. ఆనంద్, సంబంధిత శాఖల అధికారులు, లబ్దిదారులు, సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు