ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Published: Wednesday May 18, 2022
కార్పొరేటర్ రాజేశ్వరి అంజి రెడ్డి
మేడిపల్లి, మే 17 (ప్రజాపాలన ప్రతినిధి)
ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను  సద్వినియోగం చేసుకోని వారి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్
26వ డివిజన్ కార్పోరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి సూచించారు. ఈ మేరకు డివిజన్ కార్యాలయం వద్ద అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్  ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ హెల్త్ క్యాంప్ ను కార్పొరేటర్ సందర్శించారు. ఈ వైద్య శిబిరంలో బ్లడ్ గ్లూకోజ్ లేవల్స్,మరియు బిపి,షుగర్,సాచురేషన్ పరీక్షలను నిర్వహించగా  కాలనీవాసులు 150 మందికి పైగా  హాజరై పరీక్షలు చేయించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని ఉచిత హెల్త్ క్యాంప్ ల వలన ప్రజల్లో  అవగాహన వస్తుందని అన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వారిని కార్పొరేటర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డా భార్గవి, ఎన్ఎస్డి మహేశ్వరి, ఆశ వర్కర్లు, నజిమ,పద్మ,మంజుల,కే భాగ్య ,ఎం భాగ్య,అంశమ్మ, రెచల్ కాలనీ వాసులు బి వి ఎస్ ఎస్ నాగరాజు, బుచ్చిబాబు,పిర్జాదిగూడ మైనార్టీ సెల్ అధ్యక్షులు సాబీర్ హుస్సేన్,వి.సురేష్ కుమార్,బి.శ్రీధర్ గౌడ్,కే.అజయ్ కుమార్,హరికిషన్ మహిళలు జ్యోతి,సునీత,రాణి మరియు వార్డ్ ఆఫీసర్ మహమ్మద్ వాజీత్, శ్రీకాంత్ పటేల్ ,అఖిల్, బాలాజీ, ప్రవీణ్, హరీష్ పటేల్  తదితరులు పాల్గొన్నారు.