మెగా ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించిన డా.కోట రాంబాబు

Published: Monday March 14, 2022

మధిర మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మధిర నియోజకవర్గం పరిధిల ఎర్రుపాలెం మండలం నారాయణపురం గ్రామంలో "దోమాందుల చిన్నముత్తయ్య ట్రస్ట్" వారి అధ్వర్యంలో వారి కుమారుడు గ్రామ ఎంపిటిసి దోమాందుల సామెలు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిభిరంను టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు, కె వి అర్ హాస్పిటల్ అధినేత డా.కోట రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిభిరం ను ప్రారంభించి వైద్య సేవలు అందించారు... ఈ శిభిరం నందు రక్తపరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డా.కోట రాంబాబు మాట్లాడుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరు పేదలకు వైద్య సేవలు అందించడం చాలా గొప్ప విషయం అని, అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ కి వెళ్లి చూపించు కోలేని వారికి ఇవి ఎంతో ఉపయోగ పడతాయని చెప్పారు. ఈ శిభిరం నందు దాదాపు 500 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ శిభిరం నందు వైద్యులు డా.కె.అనిల్ MD, డా.రమాదేవి, డా.లక్ష్మీప్రకాష్ BDS, నిహాల్ లాబ్ కరెస్పాండంట్ శ్రీనివాస్ సేవలను అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొగ్గుల లక్ష్మి, రాజుపాలెం గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, గౌరవరం సర్పంచ్ వెంకటరావు, మాజీ ఎంపీటీసీ బొగ్గుల గోవర్ధన రెడ్డి, గూడూరు వెంకటేశ్వర రెడ్డి, మేకల రమేష్, కూరపాటి ప్రభాకర్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.