మహిళా దినోత్సవం సంద్భముగా చైర్ పర్సన్ ని కమీషనర్ ని సన్మానించిన మున్సిపాలిటీ సిబ్బంది మున్

Published: Wednesday March 09, 2022
మధిర మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మున్సిపాలిటీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధిర మున్సిపల్ ఆఫీస్ నందు మున్సిపల్ సిబ్బంది చైర్ పర్సన్ మొండితోక లతని, కమిషనర్ అంబటి రమాదేవి ని మరియు 7వ వార్డు కౌన్సిలర్ మేడికొండ కల్యాణి ని మహిళా దినోత్సవం సందర్భముగా శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవీంద్ర, మున్సిపల్ RI రాము మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.