మంచాల గ్రామానికి చెందిన కామ్రేడ్ ఏర్పుల స్వామికి ఇవ్వే మా జోహార్లు

Published: Friday January 28, 2022
ఇబ్రహీంపట్నం జనవరి తేది ప్రజాపాలన ప్రతినిధి : రంగరెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం పరిధిలో మంచాల గ్రామం లో పుట్టి పెరిగిన ఎరుపుల స్వామీ అయన మన మధ్యలో లేడు సీపీఎం పార్టీ కి తీరని లోటని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి జంగారెడ్డి మట్లాడుతూ. సిపిఎం పార్టీ లో పోరాటాలు చేసి మండలానికి కేంద్ర బిందువుగా ఉంటూ ప్రజా ఉద్యమాలను పని చేసినటువంటి ఏర్పుల స్వామి రైతాంగ పోరాటం కూలి పోరాటంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులుగా జిల్లా కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే అనారోగ్యానికి గురైన కామ్రేడ్ ఏర్పులస్వామి కామ్రేడ్ జంగారెడ్డి రాష్ట్ర నాయకులు సంతాపాన్ని ప్రకటించారు కమ్యూనిస్టు పార్టీగా కీలకమైన ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన నాయకుడిగా భవిష్యత్ తరాలకు ఆదర్శ నేతగా నిలిచాడని. మండల కేంద్రంలో ఉండి తన ఇల్లే పార్టీ ఆఫీస్ గా ప్రజాసేవలో  ముందున్న నాయకుడు ప్రజా సమస్యల పైన నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండిప్రజా సేవకుడుగా గుర్తింపు పొందిన ఏర్పుల స్వామి గొప్ప ఆదర్శ వాది గా పేరొందిన మంచాల మండలం గత 30 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో నిరంతరం పనిచేసిన నాయకుడిగా ఆరుట్ల హాస్టల్లో ఉండి  ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు ఆకర్షితులై ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో మరియూ యువజన సంఘాలను ఐక్యం చేసే మేధావి ఏర్పుల స్వామి అని కొనియాడారు వ్యవసాయ కార్మిక సంఘం గా కూల్ పోరాటాల్లో భూమి పోరాటాల్లో ఉపాధి హామీ పథకం అమలు కోసం నిరంతరం శ్రమించిన సంఘజీవి సంఘజీవి అని అన్నారు పార్టీ కోసం పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమమే నా ఊపిరిగా పని చేసిన నాయకుడిగా ఈరోజు మరణించిన కామ్రేడ్ స్వామికి ప్రగాఢ  సంతాపం కుటుంబానితెలియజేస్తున్నాము , మంచాల గ్రామానికి ఉప సర్పంచ్ గా ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో అనేక సమస్యల పైన స్పందించి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా నిక్కచ్చిగా నిలబడి ప్రజల శ్రేయస్సే కోరే వ్యక్తి గా ప్రజల వెన్నంటి ఉండి అధికారం ఏదన్న సిపిఎం పార్టీ గా అన్ని సేవలు అందించిన గొప్ప నాయకుడు  ఏర్పుల స్వామి కొనియాడారు  అదే విధంగా ఇండ్ల స్థలాల పంపిణీ కోసం మంగలి గడ్డ ఇసుక బాయ్ భూమి పంపిణీ కోసం మండలం బాంబే లేబర్ భూముల  పాస్ బుక్ ల కోసం నిరాహార దీక్షలు చేపట్టి సాధించిన కార్యశీలి అని కొనియాడారు. అర్పించిన మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాం, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి  రాములు , యు టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఏర్పుల గాలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కాడిగల్ల భాస్కర్, రంగారెడ్డి జిల్లా నాయకులు యాదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కందుకూరి  జగన్ , ఎక్స్ ఎంపీపీ ఆవుల మల్లేష్, బోడ సామిల్, గోరింకల నరసింహ, రామ్ చందర్.  నరసింహ అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యదర్శి నరసింహ , యాచారం కార్యదర్శి అల్లంపల్లి నరసింహ, ఇబ్రహీంపట్నం కార్యదర్శి, చేతల జంగయ్య, మంచాల మండల్ కార్యదర్శి శ్యామ్ సుందర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ నాయక్, , మహిళా నేత మస్కు అరుణ, రంగాపూర్ సర్పంచ్ దండేటికార్ మమత, మంచాల అధ్యక్షుడు చక్రపాణి,  కార్యదర్శి వంగల కృష్ణ, గిరిజన యూత్ ఆర్గనైజర్ నాయక్,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ప్రకాష్ కరత్ జిల్లా కార్యదర్శి శంకర్, ఎస్ఎఫ్ఐ నాయకులు జగన్, చెరుకూరి చిరంజీవి, ఏర్పుల తరుణ్, ప్రజా సంఘాల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు