గోవిందాపురం ఏ గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Published: Monday January 17, 2022
ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు పాల్గొన్నారు
బోనకల్, జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామంలో సంక్రాంతి సంబరాలు గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు పాల్గొని గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించారు. పండుగ సందర్భంగా గ్రామంలో జరిగిన వివిధ ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి డా.కోట రాంబాబు బహుమతులు అందజేశారు. అనంతరం ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో ఇచ్చిన రెండు క్రికెట్ కిట్ లను డా.కోట రాంబాబు చేతుల మీదుగా గ్రామ యూత్ కి అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాగం శ్రీనివాస్ రావు, టీఆరెఎస్ పార్టీ నాయకులు బాగం నాగేశ్వరరావు, బాగం సాయి ప్రసాద్, కావూరి శంకరరావు, షేక్ ఫకీర్ సాహెబ్, వడ్డిబోయిన పెద్ద చుక్కయ్య, బుసిపోగు తిరుపతిరావు, సతీష్, బాగం చలపతి, మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.