మహిళలను ఉత్సాహపరిచేందుకే రంగవళ్ళి పోటీలు

Published: Wednesday January 12, 2022
వాసవీక్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు కటుకం హరీష్...
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.
మంచిర్యాలబ్యూరో, జనవరి11, ప్రజాపాలన : మహిళలను ఉత్సాహపరుస్తు వారిలోని రంగవళ్ళి నైపుణ్యంను బయటకు తీసుకురావడానికే వానవీక్లబ్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతీ చోట మహిళామణులకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తుందని వానవీక్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు కటుకం హరీష్, ముక్తా శ్రీనివాన్లు అన్నారు. మంగళవారం మంచిర్యాల వానవీక్లబ్, వనితాక్లబ్, కపుల్స్ క్లబ్, యూత్ క్లబ్లు సంయుక్తంగా స్థానిక కాలేజీ రోడ్ లోని ఆర్యవైశ్య సంఘ గోక్షేత్రంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. పోటీల ముఖ్య అతిథులు వాసవీక్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు, జిల్లా గవర్నర్ బాల సంతోష్ లు ముగ్గులు వేసిన మహిళలను అభినందించారు. హిందు సాంప్రదాయ పద్ధతులను కాపాడుకుంటున్న మహిళలు ఇక నుండి సంక్రాంతి, తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాలకు చక్కని ముగ్గులను వేసి జనవరి 1న వేసే ముగ్గులను నిషేదించాలని పిలుపునిచ్చారు. బావి తరాలకు కూడా ముగ్గులను నేర్పించాలని ఇందుకు ఈ కాలం చిన్నారులకు కూడా ముగ్గులను వేయడం నేర్పించి మన సంస్కృతిని కాపాడుకోవాలని కోరారు. గోక్షేత్ర మైదానంలో జరిగిన ఈ ముగ్గుల పోటీలలో చుక్కల ముగ్గులతో పాటు చక్కని అలంకరణలతో చూపరులను అలరించేలా ముగ్గులు వేసిన ముక్తా యామిని మొదటి బహుమతి, గందె సంధ్య రెండవ బహుమతి, గజ్జెల ప్రీతి మూడవ బహుమతిని పొందగా నాల్గవ బహుమతి చకినారపు మౌనిక, ఐదవ బహుమతిని నూక స్వాతి సాధించారు. ఈ పోటీలలో పాల్గోని ప్రతీ మహిళకు బహుమతులు దాత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, వానవీక్లబ్ అంతర్జాతీయ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ దొంతుల లావణ్య ముఖేష్ దంపతులు, అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వానవీక్లబ్ క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, రీజియన్ ఛైర్మన్ వుత్తూరి రమేష్, కార్యదర్శి నాగిశెట్టి శ్రీనివాస్, జోన్ ఛైర్మన్లు కాచం సతీప్, కుంకుముట్టి వెంకటేష్, నాగిశెట్టి జ్యోతి, వాసవీక్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాను ప్రవీణ్, వానవి వనితాక్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి, కార్యదర్శి గంప వాణి, కోశాధికారి కటుకం సునీత, కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గడ్డం రమాదేవి రమేష్, కార్యదర్శి రావికంటి సంతోషి సంతోష్, కోశాధికారి బజ్జూరి వాణి శ్రీనివాస్, యూత్ క్లబ్ అధ్యక్షుడు మల్యాల యోగేశ్వర్, కోశాధికారి బోనగిరి సాయిలతో పాటు న్యాయనిర్ణేతలు గోలి పద్మ, ముక్తా రమాదేవి, నలుమాను లావణ్య, సిద్దంశెట్టి మధుశ్రీ, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు కంభంపాటి కమలాకర్ తదితరులు పాల్గోన్నారు.