బిగ్ బాస్ ఫెమ్ గంగవ్వ కు ఘన సన్మానం

Published: Thursday November 25, 2021
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 24, ప్రజాపాలన : పాత మంచిర్యాలలో తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో బిగ్ బాస్ సేమ్ గంగవ్వ కు డైరెక్టర్ బాదినేని శ్రీనాథ్ కు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  లంబాడి పల్లె జగిత్యాల జిల్లా కు చెందిన గంగవ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన సహజ నటనతో ప్రజలను ఆకట్టుకొని ప్రజల మన్ననలు పొందుతూ సెలబ్రిటీగా మారారని పేర్కొన్నారు. అదేవిధంగా మంచిర్యాల పట్టణానికి చెందిన బాదినేని శ్రీనాథ్  సినీ రంగంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ డైరెక్టర్ స్థాయికి ఎదిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్ ఉపాధ్యక్షులు మేంత్యాల సంతోష్ గంధ శ్రీ తిరుపతి నాయకులు చెంచు గురవయ్య బద్ది శ్రీనివాస్ కొల్లూరు సుధీర్ పూరెల్ల రాజు పానుగంటి బాలకృష్ణ కాసర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు