ఘనంగా ఆర్.ఎస్.ప్రవీణ్ జన్మదిన వేడుకలు

Published: Wednesday November 24, 2021

ఇబ్రహీంపట్నం నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటెర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం మండలంలోని ఘనంగా జరిగాయి. బిఎస్పీ మండల అధ్యక్షులు బొబ్బిలి దిలీప్ ఉపాధ్యక్షుడు జిల్లా పెళ్లి లక్ష్మణ్ కార్యదర్శి పెంట ప్రవీణ్ సారథ్యంలో జరిగిన జన్మదిన వేడుకలలో పలువురు మాట్లాడుతూ బహుజనుల సమస్యల పరిష్కరించడానికి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఉన్నతమైన పదవిని వదిలి బిఎస్పీలో చేరాడని, ఇలాగే ఎన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కోరుట్ల అధ్యక్షుడు గుజ్జరి ప్రకాష్ బీసీ నాయకులు ధోను పాల్ శీను మీరా బాలు రాజేందర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు