బృహత్ పల్లె ప్రకృతి వనంతో ఆహ్లాదకరమైన వాతావరణం

Published: Friday July 16, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూలై 15 ప్రజాపాలన బ్యూరో : అడవిని తలపించేలా బృహత్ పల్లె ప్రకృతి వనంగా తీర్చి దిద్దాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండలం రావుల పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దేవమ్మ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బృహత్ పల్లె ప్రకృతి వనం స్థలాన్ని పరిశీలించారు. పీతాంబర స్వామి వారిని దర్శించుకొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన బృహత్ పల్లె ప్రకృతి వనం స్థలాన్ని పరిశీలించి, శంకుస్థాపన చేసి, మొదటి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో అన్ని గ్రామ పంచాయితీలలో పార్కులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రకృతి వనంలో ప్రజలకు అన్ని హంగులు ఉండే విధంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భట్టు లలిత, జెడ్పీటీసీ మధుకర్, ఎంపీటీసీ రవీందర్, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, రైతు బంధు అధ్యక్షులు నాయబ్ గౌడ్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు మల్లేష్, కో ఆప్షన్ సభ్యులు సోయల్ షరీఫ్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.