పేదల ఆకలి తీర్చడానికి అన్నపూర్ణ క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే .. కార్పొరేటర్

Published: Monday May 17, 2021
మేడిపల్లి, మే16, (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా విపత్తులో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు మరియు దినసరి కూలీలకు ఆహారానికి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ (ఉచిత భోజన కార్యక్రమం ) ను చిల్కానగర్ చౌరస్తాలో మరియు సర్వే ఆఫ్ ఇండియా చౌరస్తాలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  మాట్లాడుతూ పేద ప్రజలు మరియు దినసరి కూలీలు ఎక్కడ కూడా ఆకలితో పస్తులు ఉండవద్దని ఈ ఉచిత భోజనము అన్నపూర్ణ క్యాంటీన్ ను ఏర్పాటు చేశామని, ఇంకా క్యాంటీన్లు అవసరమైతే తన దృష్టికి తేవాలని తెలిపారు. కార్పొరేటర్ బన్నాల గీతా మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిల్కానగర్ డివిజన్లో ఎక్కువగా పేదలు నివసించే ప్రాంతం కాబట్టి ఇక్కడ రెండు ఉచిత అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, జిహెచ్ఎంసి అధికారులు ఈ నాగేందర్, యూసీడ్ సిబ్బంది గోపాల్, రజిత, నర్సింగ్ రావు మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, రామ్ రెడ్డి, అబ్బో బాయ్, గడ్డం రవి, పండ్ల కిషన్, పరమేష్, బింగి శ్రీనివాస్, రామానుజన్, గరికె సుధాకర్, కొకొండ జగన్, మహమూద్, ముద్దం శ్రీనివాస్, రామ్ చందర్, ప్రవీణ్, శ్రీకాంత్, ఫరూక్, బాలు, కుమార్ శ్యామ్ బంటి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.