కరోనా బాధితులను ఆదుకోవాలి

Published: Saturday May 15, 2021

సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర కమిటీ సభ్యులు గోగర్ల తిరుపతి
ఆసిఫాబాద్ జిల్లా, మే13, ప్రజా పాలన ప్రతినిధి : కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు గోగర్ల తిరుపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా బాధితులను ఆదుకోవడంలో విఫలం అయ్యాయని, ప్రభుత్వాల వైఖరిని ప్రజలు గమనించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గత సంవత్సరం లాక్ డౌన్ సమయములో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన దేశ ధనికులు కొంతమంది పెద్ద ఎత్తున ప్రజలను ఆదుకోవడం కోసం విరాళాలు ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగిందని, ఆ సొమ్మును ప్రభుత్వ నాయకుల ఇళ్లలోకి వెళ్ళిపోయాయి అన్నారు. ఇప్పటివరకు పేద ప్రజలకు ఎలాంటి సౌకర్యాన్ని కానీ,  హాస్పిటల్స్ సౌకర్యాలను కానీ, చేయలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు,  ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, వారి ఆరు నెలల జీత భత్యాలను, పేద ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలన్నారు. కరోనా సోకి బాధపడుతున్న కుటుంబాలకు ఆర్థిక సహాయంగా రూ 2 లక్షలు, కరోనాతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ 10 లక్షలు ఇవ్వాలని కోరారు.