*బండి సంజయ్ అక్రమ అరెస్ట్ అ ప్రజాస్వామ్యం* -బండి సంజయ్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిచిన, -కందవ

Published: Thursday April 06, 2023
చేవెళ్ల ఏప్రిల్ 05(ప్రజాపాలన):-


తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా లేదా నియంతృత్వ పాలన నడుస్తుందా అని కందవాడ ఉపసర్పంచ్ గౌండ్ల కావ్యకృష్ణ గౌడ్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని బట్టలు చినిగిపోయెలా అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజా స్వామీకం అన్ని అన్నారు.అర్థరాత్రి అకారణంగా,
అన్యాయంగా,ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా,ఎందుకు అరెస్టు చేస్తున్నారు చెప్పకుండా అరెస్టు చేయడం దారుణమని అన్నారు.
లిక్కర్ స్కాంలో బిడ్డను ఇలాగే అరెస్ట్ ఎందుకు చేయలేదు?
పేపర్ లీకేజీ స్కాం లో కొడుకును ఇలాగే అరెస్ట్ ఎందుకు చేయలేదు? అన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వ అవినీతిపై,అరాచకాలపై అనునిత్యం ప్రశ్నిస్తూ..
మీ కుటుంబ పాలన వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకా.. అక్రమ అరెస్టులు,కేసులతో ప్రశ్నించే గొంతుకలను ఆపలేవుp. రాబోవు రోజుల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు,నీ కొడుకుకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీకి
పోయే రోజులు దగ్గర పడ్డాయని, తెలంగాణ ప్రజలంతా ఈ నియంత పాలను గమనిస్తున్నారని అన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన బండి సంజయ్ ని బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.