కెసిఆర్ ప్రభుత్వంలోని మధిర పట్టణ అభివృద్ధి.

Published: Saturday February 04, 2023

జడ్పీ చైర్మన్ మధిర ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడుమున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.30 కోట్ల రూపాయలు కేటాయించిన కేసీఆర్ కి ప్రజలంతా మద్దతుగా నిలవాలి.ప్రజలందరి సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగిస్తాంమధిర 21వ వార్డులలో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తాంమధిర పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రగతి పథంలో నిలుపుతాం.ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ట్యాంక్ బండ్ సహా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, సెంట్రల్ డివైడర్ లైటింగ్ తో పాటుగా పట్టణ సుందరికరణ చేశాం
ఎన్నికల సమయంలో వచ్చి మాయ మాటలు చెప్పే వారికి తగిన గుణపాఠం చెప్పి టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి
మున్సిపాలిటీ పరిధిలో  21వ వార్డులలో జరిగిన  పలు సమస్యలపై గుడ్ మార్నింగ్ కార్యక్రమం లో జరిగిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే మధిర పట్టణ అభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్మన్, బీ.ఆర్.ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు మధిర మున్సిపాలిటీ పరిధిలో పార్టీ ఆధ్వర్యం లో గుడ్ మార్నింగ్ మధిర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అందులో భాగంగా 21 వార్డులో మార్నింగ్ వాక్ చేస్తూ వార్డు మొత్తం కలియ తిరిగారు. ఆ వార్డులో ఉన్న సమస్యల పరిష్కారం తో పాటుగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజల తో ఆయన నేరుగా చర్చించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర మున్సిపల్ అభివృద్ధి కోసం రూ.30 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రజలంతా మద్దతుగా ఉండాలని కోరారు ప్రజలందరి సహకారంతో మధిర పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఇప్పటికే ప్రజలకు ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం సహా ట్యాంక్ బండ్, 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు పట్టణంలో పలు చోట్ల పార్కులు ఏర్పాటు చేసుకున్నామని సెంట్రల్ డివైడర్ తో పాటుగా లైటింగ్ సహా అంబేద్కర్ సెంటర్ ను సుందరికరణ చేశామని గుర్తు చేశారు 21వ వార్డులో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు పట్టణంలో ఉన్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ను కూడా సుందరికరణ తో తీర్చిదిద్దామని తెలిపారు ఎన్నికల సమయం రాగానే వచ్చి మాయ మాటలు చెప్పే వారికి ప్రజలు తగిన గుణపాఠం  చెప్పి కేసీఆర్ కి మద్దతుగా  బిఆర్ఎస్ ఆశీర్వదించాలని కోరారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇంత పెద్ద ఎత్తున నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి, పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ మొండితోక లతా కిష్టప్రసాద్ అప్పారావు అరగి శ్రీను పలువురు వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బందిపాల్గొన్నారు