ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి *ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ

Published: Thursday January 12, 2023

పార్టీకి ద్రోహం చేస్తున్న శేఖర్ గౌడ్ నిరంజన్ రెడ్డి దండం రామ్ రెడ్డి శివకుమార్ లకు పట్నం కాంగ్రెస్ కార్యకర్తలే తగిన బుద్ధి చెప్పడం ఖాయం...పత్రికా సమావేశంలో వెల్లడించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గురునాథ్ రెడ్డి..జెడ్పిటిసి దేవదాస్ గౌడ్..యాచారం వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి..జిల్లా అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్ కుమార్ మాదిగ.. నరేందర్ రెడ్డి ఎంపిటిసి తదితర ముఖ్య నేతలు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని కొంతమంది స్వార్థపూరిత నాయకులు అధికార పార్టీ నాయకుల ఎంగిలి మెతుకులు తిని పార్టీ నాయకుడి పైన ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కార్యకర్తలే తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు..
బుధవారం ఇబ్రహీంపట్నం కేంద్రంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో సీనియర్ నాయకులు కంబాలపల్లి గుర్నాథ్ రెడ్డి. జడ్పిటిసి బింగి దేవదాస్ గౌడ్  యాచారం వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్ కుమార్  మంచాల మండలం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నరేందర్ రెడ్డి  పెద్ద అంబర్పేట్ మున్సిపల్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జడల రవీందర్ రెడ్డి  మరియు మున్సిపల్ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను గెలిపించడంలో  పార్టీని కాపాడడంలో కార్యకర్తలకు ధైర్యం చెప్పడంలో మల్ రెడ్డి రంగారెడ్డి పాత్ర ఎనలేనిది అని తెలియజేశారు కొంతమంది స్వార్థ నాయకులు కనీసం సభ్యత్వం లేని వారితో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మాట్లాడిన తీరు చూస్తుంటే నిజానికి వారు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి పని చేశారా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రశ్నిస్తున్నారు. మర్రి నిరంజన్ రెడ్డి  మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ద్రోహం చేయడం మీకు అలవాటైపోయింది గతంలో టిడిపి వీడి టిఆర్ఎస్ కి తర్వాత కాంగ్రెస్ కి వచ్చి నిలకడ లేకుండా సొంత నాయకుల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని గురు నాథ్ రెడ్డి హెచ్చరిక  చేశారు.. అధికార పార్టీ నాయకులతో మిలాకత్ అయిన నీవు కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడడం సిగ్గుగా ఉందని అన్నారు మీ కుటుంబానికి జడ్పిటిసి కౌన్సిలర్ బీఫాం లు ఇచ్చిన ఘనత మల్ రెడ్డి రంగారెడ్డి కి దక్కిందని అటువంటి నాయకుడు పై ఇంకోసారి మాట్లాడితే నియోజకవర్గం లో కాంగ్రెస్ కార్యకర్తలే నీకు బుద్ధి చెప్తారని అన్నారు. జడ్పిటిసి బింగి దేవదాస్ గౌడ్ మాట్లాడుతూ ఈసీ శేఖర్ గౌడ్  కొత్త కురుమ శివకుమార్  మీ స్థాయి దగ్గరకు వ్యవహరించాలని నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి చేయాల్సింది పోయి పార్టీ నాయకుల పైన సాయి లేకుండా మాట్లాడడం సిగ్గుగా ఉందన్నారు ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి సర్పంచ్ల గెలుపులలో మీ పాత్ర లేదని కనీసం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు చేసిన కార్యక్రమాలు కూడా మీరు ఎక్కడున్నారని అన్నారు కౌన్సిలర్ టికెట్ ఇస్తే ఓడిపోయిన శేఖర్ గౌడ్ గారు...అలాగే ప్రతిరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేతో తలవంచి నమస్కారం చేస్తూ వారితో కుమ్మక్కై మాట్లాడుతున్న కొత్తకుర్మ శివకుమార్ గారికి మల్ రెడ్డి రంగారెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని హెచ్చరించారు,
పెద్ద అంబర్పేట్ మున్సిపల్ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ..దండం రామ్ రెడ్డి అనే వ్యక్తిని పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో పార్టీ కార్యకర్తలు లీడర్ గా గుర్తించరని అతను ఎంతసేపు ఎల్బీనగర్ ఎమ్మెల్యే తో రాజకీయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానని చెప్పడం దయ్యాలు వేదాలు చల్లినట్టుగా ఉందన్నారు.. నిత్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచే రకం దండం రామ్ రెడ్డిది అని వీరికి ఎంతసేపు అధికార పార్టీ నాయకుల మీద ప్రేమ తప్ప నియోజకవర్గంలో పార్టీ నాయకులను గెలిపిద్దాం అనే ఆశ ఉండదు అన్నారు పాత పదవులను తగిలించుకొని పట్నంలో తిరగాలని చూస్తే ఇకపై కాంగ్రెస్ కార్యకర్తలు సహించేది లేదని హెచ్చరించారు.ఇకనైనా మీరంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మల్ రెడ్డి రంగారెడ్డి  నాయకత్వంలో పనిచేయాలని ఏదైనా ఇబ్బందులు ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియజేయాలి గాని ఇష్టం వచ్చినట్లు వ్యక్తులపైన మాట్లాడితే ఇకనుంచి సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి హెచ్చరిస్తున్నామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మల్ రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో పని చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు జడల రవీందర్ రెడ్డి..స్థానిక కౌన్సిలర్స్ ఆకుల మమతా ఆనంద్..పంది శంకరయ్య నరాల విశాలసాగర్..సుల్తానా ఫిరోజ్ మోహన్ నాయక్ తోపాటు స్థానిక నాయకులు ఎదుల పాండురంగారెడ్డి రమేష్..మంకాల కరుణాకర్..పెద్ది  శ్రీకాంత్..రవికుమార్..ఏర్పుల రాజు మాదిగ..సాయి తోపాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.