పెండింగ్ వేతనాలు, వెంటనే చెల్లించాలి

Published: Tuesday November 22, 2022
 మంచిర్యాల టౌన్, నవంబర్ 21, ప్రజాపాలన : పెండింగ్ వేతనాలు,   వెంటనే చెల్లించాలని 
 సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్   ఆధ్వర్యంలో సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ఎ ఒ కు వినతిపత్రం అందజేశారు.   ఈ సందర్భంగా  అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్  లు మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ద్వారా    100 మంది వర్కర్లు పనిచేస్తున్నారు 11వ పి ఆర్ సి కి సంబంధించి రావలసిన ఏరియల్స్  2021 జూన్ నుండి   పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో గత రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వ ఎస్ సి కళాశాల హాస్టల్స్ లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ద్వారా వర్కర్లకి గత మూడు నెలల నుంచి వేతనం రావడం లేదు, జిల్లాలో గిరిజన ఆశ్రమం పాఠశాలలో డైలీ వైస్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం అన్ని రకాలుగా పనిచేస్తున్న వర్కర్లకు గత రెండు నెలల నుంచి వేతన లు, ఏరియల్స్ రాక ఇబ్బంది పడుతున్నారని ఆరోపించాడు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్  స్పందించి పెండింగ్ వేతనాలు, ఏరియాల్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యాకుబ్, మల్లేష్, ప్రభాకర్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.