రైతు సంఘం జిల్లా ద్వితీయ మహాసభలన జయప్రదం చేయండి.

Published: Monday November 21, 2022
చౌటుప్పల్, నవంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి): చౌటుప్పల్ పట్టణంలో నవంబర్ 22న జరిగె రైతు సంఘం యాదాద్రిభువనగిరి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ అన్నారు. స్థానిక కందాల రంగారెడ్డి భవన్ చౌటుప్పల్ లో రైతు సంఘం చౌటుప్పల్ మండల 5వ మహాసభల లో ముఖ్య అతిథిగా పాల్గొనిమాట్లాడుతూ రైతుల పట్ల పాలకుల చిన్న చూపుతో దేశ ప్రాథమిక రంగం అయిన వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. రాఫెల్ కుంబకోనాన్ని తలదన్నే వ్యవసాయ కుంభకోణం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో వందలాది మంది రైతుల ప్రాణాలను బలిగొన్నది. రైతుల మహాపోరాటంతో దిగివచ్చిన కేంద్రం చట్టాలపట్ల వెనక్కి తగ్గినా రైతులపై అక్రమ కేసలు ఎత్తివేయలేదన్నారు. విద్యుత్ సంస్కరణ చట్టంతో రైతులకు మోటార్లకు మీటర్లు బిగించే కుట్ర జరుగుతుందన్నారు. ధరణి పోర్టల్ లో ఉన్న సాంకేతిక సమ్యస్యులు పరిష్కరించి పెండింగ్ లో ఉన్న పాస్ పుస్తకాలు ఇవ్వాలని అన్నారు. ఏక కాలంలో రైతులకు లక్ష రూపాయల ఋణ మాఫీ చేయాలన్నారు. రెవిన్యు సదస్సులు నిర్వహించి గ్రామాల్లో పేరుకుపోయిన భూ సమస్యల్ని పరిష్కరించాలన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో కాల్వల్లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలని త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాలి. పోడు భూములకు పట్టా పాస్ పుస్తకాలు అందివ్వాలని జిల్లాలో రైతాంగ సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమాలకు రూపకల్పన చేసేందుకు చౌటుప్పల్ లో జరిగే జిల్లా మహాసభలకు 300 మంది ఎంపిక చేయబడిన ప్రతినిధులు హాజరవుతున్నారని రైతులు ఈ మహాసభల జయప్రదం చేయగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణా రెడ్డి చేరిక అలివేలు, మాజీ PA CS చైర్మన్ చీరిక జీవ రెడ్డి PACS డైరక్టర్ బోరెం నర్సి రెడ్డి, నాయకులు ఆకుల ధర్మయ్య, సామిడి అంజి రెడ్డి, మాడగొని మారయ్య, సప్పిడి లక్స్నా రెడ్డి, చింత పల్లి నర్శి రెడ్డి, ఎల్కరాజు యాదగిరి, అంతటి అశోక్, గుడేటి నర్సింహా, కొండే శ్రీశైలం, ఇట్ట బోయిన శేఖర్, తదితరులు పాల్గొన్నారు.