100 కోట్లతో మధిరను అభివృద్ధి చేశా

Published: Saturday November 05, 2022
మధిరలో టిఆర్ఎస్ గెలుపును ఏ శక్తి ఆపలేదుకెసిఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలే మధిరలో టిఆర్ఎస్ ని గెలిపిస్తాయి
 ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు వెల్లడి
మధిర నవంబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మధిర నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా నలభై నెలలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ప్రజాపాలన విలేకర్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే ఈసారి మధిరలో టిఆర్ఎస్ ని గెలిపిస్తాయని ఆయన అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా సాధించిన విజయాలు ప్రజల సమస్యలపై పరిష్కారం కోసం లింగాల కమల్ రాజు చూపిన చొరవ, కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, అవసరమైన వారికి సకాలంలో వైద్య సేవలు అందించడం, ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేయించడం లాంటి అనేక విషయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గా మధిర నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకొచ్చారుకమల్ రాజు నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛఐన వంద పడకల ఆసుపత్రిని మధిరకు మంజూరు చేయించాను. ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో నిలిచిపోయిన ట్యాంక్ బండ నిర్మాణ పనులు టిఆర్ఎస్ పాలనలో చేపట్టి పూర్తి చేయబోతున్నాం!. పట్టణ ప్రజలందరికీ నిత్యవసర సరుకులు కూరగాయలు మాంసాహారం ఒకే చోట అందుబాటలో ఉండేవిధంగా సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రధానమైన రహదారులన్నిటికీ మరమ్మతులు చేశాను.
 నియోజకవర్గంలో ఎర్రుపాలెం మధిర మండలాలకు రెండో జోన్ ద్వారా సాగర జలాలు తెచ్చేందుకు మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారాకమల్ రాజు* ప్రస్తుతం ఈ మండలాలకు మూడో జోన్ ద్వారా సాగర్ జలాలు అందుతున్నాయి. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. జిల్లా మంత్రి అజయ్ కుమార్ తో మాట్లాడి తప్పనిసరిగా రెండో జూన్ ద్వారా ఆయా మండలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తా!
 నియోజకవర్గంలో మీ దృష్టిలో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?కమల్ రాజు* సమాజం అభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి. దీనికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో గురుకులాలు ఏర్పాటు చేసి సామాన్యులకు మెరుగైన విద్య ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చాను. వైద్యం పరంగా చూస్తే నియోజకవర్గంలో ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు మధిర పట్టణంలో విధాన పరిషత్ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం!. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే కెసిఆర్ కిట్ తో పాటు ఆర్థిక సహాయం అందించటంతో ప్రభుత్వాసుపత్రిలో కాన్పులు శాతం భారీగా పెరిగింది. అర్హులైన వారందరికీ సామాజిక పెన్షన్ అందిస్తున్నాం!. రైతులకు రైతుబంధు, పేదలకు కళ్యాణ లక్ష్మి, దళితులకు దళిత బంధు ఇలాంటి అనేక పథకాలు ద్వారా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగింది.
 మధిర నియోజకవర్గంలో టిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగితే ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మధిరలో మీ పార్టీ గెలుస్తుందా?కమాల్ రాజు* ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మధిర నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి. గత ఎన్నికల్లో కేవలం టిఆర్ఎస్ పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో తాను చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీలతో పాటు కాంగ్రెస్ నుండి నియోజకవర్గంలో భారీ స్థాయిలో టిఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో మధిరలో వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేస్తాం!
 గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మీ పార్టీ నాయకులే మీ పార్టీని ఓడించారని ముఖ్యమంత్రి చెప్పారు. అదే విధానం మధిర నియోజకవర్గంలో మళ్ళి జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?కమల్ రాజు* ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల్లో పార్టీ నాయకులు అందరూ కలిసి పనిచేస్తారు. మధిరలో అధికార పార్టీకి ఎమ్మెల్యే లేకపోవడం సకాలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందటం లేదు. స్థానిక ఎమ్మెల్యే మంత్రులను కలిసి నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో విఫలం చెందారు. దీంతో కొంత అభివృద్ధి ఆగిపోయింది. జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో తానే జిల్లా మంత్రి అజయ్ కుమార్ వద్దకు వెళ్లి మధిర కు 100 కోట్లు నిధులు తీసుకొచ్చి  అభివృద్ధి చేశా! మధిర కి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇంకా భారీ స్థాయిలో నిధులు వస్తాయి. దీనిని మేధావులు ప్రజలు  గ్రహించారు. దీంతో తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని మధిరలో గెలిపించాలని ఆలోచనకు వచ్చారు.