కుల వృత్తులను కాపాడుతున్నాం: శ్రీనివాస్ గౌడ్

Published: Monday July 31, 2023

కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. కలెక్టరేట్  సమీపంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూరల్ మండలం జైనల్లీపూర్, కోడూరు, మాచన్ పల్లి గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల వృత్తులను కాపాడుకునేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 

గొర్రెల పంపిణీతో కురుమ, యాదవులు ఆర్థికంగా అభివృద్ధి చెందారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల ఏర్పాటుతో పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు. లైబ్రరీ చైర్మన్  రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్  గంజి వెంకన్న, మున్సిపల్  చైర్మన్  కేసీ నర్సింలు, పీఏసీఎస్​ చైర్మన్  రాజేశ్వర్ రెడ్డి, ఆంజనేయులు, గిరిధర్ రెడ్డి, జీజీహెచ్  సలహామండలి సభ్యుడు సత్యం యాదవ్, పశుసంవర్ధక శాఖ ఏడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.