మూవీ : విజయ్ 69
నటీనటులు: అనుపమ్ ఖేర్, రాజ్ శర్మ, నరేంద్ర జెట్లీ, చంఖీ పాండే, ఏకవలి ఖన్నా, చేపట్టారు
ఎడిటింగ్: మానస్ మిట్టల్
సంగీతం: గౌరవ్ చటర్జీ
సినిమాటోగ్రఫీ: సాహిల్ భరద్వాజ్
నిర్మాతలు: మనీష్ శర్మ
రచన, దర్శకత్వం: అక్షయ్ రాయ్
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథ:
ఓ ముసలాయన ముంబైలోని సముద్ర వంతెనపై నిలబడి దూకాలని ప్రయత్నిస్తాడు. ఇక కాసేపటికి దూకేస్తాడు. ఇక తర్వాత రోజు అరవై తొమ్మిదేళ్ల విజయ్(అనుపమ్ ఖేర్) నీళ్ళలో దూకి చనిపోయాడంటూ ఫోటో పెట్టి అందరు దేవుడికి ప్రార్థన చేస్తూ అతడి గురించి మాట్లాడుతుంటారు. అదే సమయంలో విజయ్ అక్కడికి వస్తాడు. అదంతా చూసి ఏంటి మీరు చేసేది అని అనడంతో అతడిని చూసి అందరు షాక్ అవుతారు. ఇక విజయ్ వాళ్ళ కూతురు ఫ్యామిలీ కూడా వస్తుంది. విజయ్ స్నేహితుడు డాక్టర్ ఫలీ అతనికి ఎప్పుడు అండగా ఉంటాడు. ఇక అతను చనిపోవాలనుకోలేదని నీళ్ళని చూసి స్విమ్మింగ్ చేయాలనిపించిందని, ఫోన్ చార్జ్ పెట్టి ఇంట్లోనే మర్చిపోయానని వాళ్ళందరికి వివరించడంతో అందరు కన్విన్స్ అవుతారు. అందులో విజయ్ చేసిన అచీవ్మెంట్స్ ఏమీ లేవని రాయడంతో అది చూసి ఏదైనా సాధించాలని బలంగా కోరుకుంటాడు. అందుకే విజయ్ ట్రైట్లాన్ లో పాల్గొననున్నాడు. మరి విజయ్ అందులో పాల్గొనడానికి ఎంపికయ్యాడా? ట్రైత్లాన్ లో గెలిచాడా లేదా? అనేది మిగిలిన కథ. (విజయ్ 69 మూవీ రివ్యూ)
విశ్లేషణ:
సినిమా మొదలవ్వడమే ఇంట్రస్ట్ గా ఉంటుంది. విజయ్ క్యారెక్టర్ తో ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఓ వయసొచ్చాక పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి బరువు, భాద్యతలు ఉండవు. ఆ పాత్రలో విజయ్ పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అయితే అతను మాట్లాడే బూతులే కాస్త ఇబ్బంది పెడతాయి.
గంట యాభై నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా ఓ ముసలాయన లైఫ్ లో ఏదైనా గొప్పగా సాధించాలని, లైఫ్ అచీవ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఇందులో పెద్దగా ఇన్ స్పైర్ అవ్వడానికి ఏమీ లేదు. సినిమా అంతా మాములుగా బోరింగ్ గా వెళ్తుంది. క్లైమాక్స్ చూసాక ఎంట్రా ఇది అనిపిస్తుంది. అరవై తొమ్మిదెళ్ళ ముసలాయన అంట.. స్విమ్మింగ్ చేస్తూ మళ్ళీ వెనుకకొచ్చి ఒకరిని కాపాడతాడంట.. ఇక స్విమ్మింగ్ అయిన వెంటనే ఓ నలభైకి సైక్లింగ్ అంట..ఆ వెంటనే పది కిలోమీటర్లు లాంగ్ రన్ అంట.. ఇవన్నీ చేసేస్తాడంట.. భారతీయుడు-2లో తాత క్యారెక్టర్ కంటే దారుణంగా ఉంది.
పోలీస్ ట్రైనింగ్ లో ఒక్క కిలోమీటర్ పరుగెత్తడానికే చుక్కలు కనపడుతున్నాయి. మరీ ఓ ముసలాయన ఇవన్నీ చేయడం ఊహకి కూడా అందదు. సినిమాలోనే ఓ పాయింట్ లో అనుపమ్ ఖేర్ చెప్తుంటాడు. ఒకతను అరవై ఏళ్ల వయసులో ఇన్ స్టాంట్ నూడిల్స్ కనిపెట్టాడంటూ చెప్తాడు. అలాంటివి చేస్తే ఎవరైన నమ్ముతారు కానీ ఇలా రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ అంటే ఆడియన్స్ కి కూడా 'ఏంట్రా మాకు ఈ కర్మ' అనిపిస్తుంది. ఇన్ స్పైరింగ్ ఎలిమెంట్స్ ఒక్కటి లేకపోగా బోరింగ్ అనిపిస్తుంది. సినిమాని ఒక్కసారి బలవంతంగా చూడొచ్చు అంతే. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఓకే. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
విజయ్ పాత్రలో అనుపమ్ ఖేర్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. ఇక మిగిలినవారంతా వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా..
జస్ట్ వన్ టైం వాచెబుల్. అది కూడా ఓపిక ఉంటే మాత్రమే.
రేటింగ్: 2/5