ప్రధాన వార్తలు
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి

* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో  ఆసరా * రాష్ట్ర వ్యాప్తంగా 2604 రైతు వేదికల నిర్మాణం * రైతుబంధు కింద 7500 కోట్లు పంపిణీ * నవాబ్‌పేట్‌ మండలంలో పర్యటించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 20 ( ప్రజాపాలన ) : అన్నం పెట్టే రైతన్నకు కన్నీరు రాకుండా చూస్తున్న ఘనత సిఎం  కేసీఆర్ కు దక్కుతుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం చేవెళ్ళ నియోజకవర్గము నవాబుపేట్ మండల కేంద్రంలో రైతు వేదికను, పాఠశాల అదనపు గదులు, లైబ్రేరీ భవనాన్ని, ఎల్లకొండ, గ్రామాల్లో రైతు వేదికలను, ప్రారంభించారు. చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ  సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యలతో కలిసి ప్రారంభోత్సవాలలో పాల్గొన్న మంత్రి సబితా రెడ్డి. చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయలతో  ఆసరాగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చర్చించుకోవడానికి, సలహాలు, సూచనలు పొందటానికి 2604 రైతు వేదికలు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. నేరుగా ఎకరాకు 5 వేల పెట్టుబడి సహాయం, సంవత్సరానికి 10 వేలు రైతు బంధు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని గుర్తు చేశారు. రైతు బంధు కింద 7500 కోట్ల పంపిణీ చేశామని వివరించారు. రికార్డ్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మాణాలు పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు కోసం కృషి చేస్తున్నామన్నారు. 19 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎల్లకొండ శివాలయంలో పూజలు నిర్వహించారు. 

దగ్గుబాటి ఫ్యామిలీలో మరో స్మార్ట్ హీరో?

టాలీవుడ్ లో స్టార్ హీరోల కుటుంబాల నుంచి నటవారసుల వెల్లువ చూస్తున్నదే. నంబర్ ఎంతో లెక్కించడం అభిమానులకు అలవాటు వ్యాపకంగా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి డజను.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు.. మంచు ఫ్యామిలీ నుంచి నలుగురు.. నందమూరి కుటుంబం నుంచి ఆ నలుగురు!! అంటూ లెక్కలు వేస్తున్నారు.

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

వికారాబాద్, ఏప్రిల్ 27, ప్రజాపాలన బ్యూరో : ప్రజలందరూ కరోనా బారిన పడకుండా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించామని వికారాబాద్, తాండూర్ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్ పైలెట్ రోహిత్ రెడ్డి లు సంయుక్తంగా తెలిపారు. మంగళవారం హనుమాన్ జయంతి సందర్భాన్ని పురస్కకరించుకొని మున్సిపల్ పరిధిలోని 15వ వార్డుకు సంబంధించిన మారుతి నగర్ లోని హనుమాన్ దేవాలయంలో వార్డ్ కౌన్సిలర్ చిట్యాల అనంత రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మురళి కృష్ణ గౌడ్ లతో కలిసి ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇంట్లోనే క్షేమంగా ఉంటూ హనుమంతున్ని భక్తి శ్రద్ధలతో పూజించాలన్నారు. ప్రజలందరూ కరోనా బారిన పడకుండా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో, ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావొద్దన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు
ప్రజా పాలన వార్తకు స్పందన

బెల్లంపల్లి మే 7 ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ ఐసోలేషన్ కేంద్రంలో వ్యాక్సిన్ కోసం వచ్చిన పేషెంట్లకు కనీస సదుపాయాలులేక ఎండలో నిలబడి నానా తంటాలు పడుతున్న విషయాన్ని ప్రజాపాలన. దినపత్రికలో ప్రచూరించడం జరిగింది. దీంతో అధికారులు స్పందించారు. రోగులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నీడకోసం గ్రీన్ షీట్ ని కట్టి, ఆ ప్రాంతంలో కుర్చీలు ఏర్పాటు చేశారు. సౌకర్యాల ఫట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన కు వందనాలు తెలుపుతున్నారు.

రంజాన్ కానుకలు పంపిణీ

బెల్లంపల్లి, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పర్వదినం సందర్భంగా అందిస్తున్న కానుకలను పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎం పి పి గోమాస శ్రీనివాస్. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కానుకల కిట్లను శుక్రవారం నాడు బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురజాల గ్రామంలో పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి వర్గ విభేదాలు లేకుండా ఆయా పండుగలకు అందిస్తున్న కానుకలను తీసుకొని వారి వారి పండుగలను సాంప్రదాయబద్ధంగా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంజిత-వెంకటేష్ గౌడ్, వార్డుసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వికలాంగులకు వయసు పైబడిన వారికి ఇంటి వద్దనే టీకాలు వేయాలి

బెల్లంపల్లి, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా బారిన పడకుండా వేసే వ్యాక్సిన్ టీకాలను వికలాంగులకు వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఇప్పించే ఏర్పాట్లు చేయాలనీ అంబేద్కర్ పూలే మహాజన సంగం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు గొడిశెల రసజ్ఞ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల, గ్రామాల్లోని, బెల్లంపల్లి పట్టణంలోని, వికలాంగులకు మరియు వయస్సు పైబడిన వారికి వారి వారి ఇళ్ల వద్దకు వచ్చి టీకాలు వేసే ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా వైద్య అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో రోగులకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచి వెంటిలేటర్ నిపుణులను నియమించాలని ఆయన కోరారు.

బిజినెస్
జన్‌ధన్ ఖాతాలు ఇపుడు ఆర్థిక నేరగాళ్ళకు అడ్డా

దేశంలో సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తేవాలన్న బృహత్ సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకం జన్‌ధన్ స్కీమ్. అతి తక్కువ కాలంలో పది కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగింది. ఇది ఓ రికార్డుగా మారింది. అయితే, ఈ జన్‌ధన్ ఖాతాలు ఇపుడు ఆర్థిక నేరగాళ్ళకు అడ్డాగా మారింది. ఇదే విషయంపై భారత రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా స్పందిస్తూ జన్‌ధన్‌ ఖాతాలు ఆర్థిక నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు కేంద్రం కానున్నాయని, ఇలాంటి ఖాతాలను ఆర్థిక నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందువల్ల వాటిపై నిరంతరం పర్యవేక్షించే ఒక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాంకుల్లో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల ద్వారా ఖాతాదారుకు తెలియకుండానే భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్టు ఇటీవల బయటకు వచ్చిన కేసును ఆయన ఉదహరించారు. అది పంజాబ్‌లోని ఒక రోజుకూలీ ఖాతా అని, బేసిక్‌ ఖాతాగా ప్రారంభించిన దానిలో లావాదేవీలపై కూడా పరిమితి ఉన్నప్పటికీ కోటి రూపాయల లావాదేవీ జరిగిందని వివరించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆ కూలీకి నోటీసు పంపగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. బ్యాంకు ఖాతా ప్రారంభించే సమయంలో కెవైసి నిబంధనలు తుచ తప్పకుండా పాటించినా తదుపరి నిఘాలో మాత్రం బ్యాంకులు విఫలమయ్యాయనేందుకు ఇది సంకేతమన్నారు. బ్యాంకుల అంతర్గత నిఘా వ్యవస్థ కాలం చెల్లిపోయింది కావడం వల్ల ఇలాంటి దుర్వినియోగాన్ని గుర్తు పట్టలేకపోయిందని వ్యాఖ్యానించారు.

భారత దేశంలో రిలయన్స్ నెంబర్ 1

భారత దేశంలో రిలయన్స్ నెంబర్ 1

అంతర్జాతీయ
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి

* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో  ఆసరా * రాష్ట్ర వ్యాప్తంగా 2604 రైతు వేదికల నిర్మాణం * రైతుబంధు కింద 7500 కోట్లు పంపిణీ * నవాబ్‌పేట్‌ మండలంలో పర్యటించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 20 ( ప్రజాపాలన ) : అన్నం పెట్టే రైతన్నకు కన్నీరు రాకుండా చూస్తున్న ఘనత సిఎం  కేసీఆర్ కు దక్కుతుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం చేవెళ్ళ నియోజకవర్గము నవాబుపేట్ మండల కేంద్రంలో రైతు వేదికను, పాఠశాల అదనపు గదులు, లైబ్రేరీ భవనాన్ని, ఎల్లకొండ, గ్రామాల్లో రైతు వేదికలను, ప్రారంభించారు. చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ  సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యలతో కలిసి ప్రారంభోత్సవాలలో పాల్గొన్న మంత్రి సబితా రెడ్డి. చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయలతో  ఆసరాగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చర్చించుకోవడానికి, సలహాలు, సూచనలు పొందటానికి 2604 రైతు వేదికలు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. నేరుగా ఎకరాకు 5 వేల పెట్టుబడి సహాయం, సంవత్సరానికి 10 వేలు రైతు బంధు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని గుర్తు చేశారు. రైతు బంధు కింద 7500 కోట్ల పంపిణీ చేశామని వివరించారు. రికార్డ్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మాణాలు పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు కోసం కృషి చేస్తున్నామన్నారు. 19 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎల్లకొండ శివాలయంలో పూజలు నిర్వహించారు. 

ఇసుక అక్రమ రవాణా

అవసరానికి మించి సిమెంట్ బ్రిక్ కంపెనీలు ఇసుకను గుట్టలుగా నిల్వ ఉంచి సమయం చూసుకొని ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు* *మధిర రాయపట్నం మధ్య వైరా నది ఒడ్డున ఏర్పాటైన  కంపెనీలు అవసరానికి మించి నది నుండి తమ యొక్క కంపెనీల్లోని ఇసుకను నిల్వ ఉంచి గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు ఆక్రమణ జరుగుతున్నట్లు సమాచారం దీనిపై అధికారులు స్పందన కరువైంది.* *ఈ విధంగా నది ఒడ్డున సిమెంట్ బ్రిక్స్ కంపెనీ ఏర్పాటు చేసి ఇసుక నుండి ఇటుకల రూపంలో మార్చి విక్రయిస్తూ ఇదో రకమైన దోపిడీకి పాల్పడుతున్న కంపెనీలపై చర్య తీసుకోవాలి.*          

దీక్షకు సంఘీభావం

ఈరోజు ఖమ్మం జిల్లా వైరా లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘము ఆద్యర్యములో ఆర్యవైశ్య కార్పొరేషన్ మరియు EWS రిజర్వేషన్ కొరకు చేపట్టిన నిరసన దీక్షకు, జిల్లా బీజేపీ మరియు ఆర్యవైశ్య నాయకులు, కుంచం కృష్ణారావు సంఘీభావం తెల్పి మద్దతు ప్రకటించారు, ఈ సంఘీభావం లో బీజేపీ మధిర పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేష్ సంఘీభావం తెల్పి మద్దతు ప్రకటించారు.

సినిమా
దగ్గుబాటి ఫ్యామిలీలో మరో స్మార్ట్ హీరో?

టాలీవుడ్ లో స్టార్ హీరోల కుటుంబాల నుంచి నటవారసుల వెల్లువ చూస్తున్నదే. నంబర్ ఎంతో లెక్కించడం అభిమానులకు అలవాటు వ్యాపకంగా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి డజను.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు.. మంచు ఫ్యామిలీ నుంచి నలుగురు.. నందమూరి కుటుంబం నుంచి ఆ నలుగురు!! అంటూ లెక్కలు వేస్తున్నారు.

చుండ్రు నివారణకు హెన్నా

హెన్న(గోరింటాకు) చుండ్రును సమర్ధవంతంగా తొలగించగలదు. ఇది యాంటీ బ్యాక్టీరియా కండీషనర్ గా కూడా పని చేస్తుంది. హెన్న తీసుకుని దానిలో కొన్ని చుక్కలు నిమ్మ రసాన్ని అలాగే ఆలివ్ ఆయిల్ ను కలిపి తలకు పట్టించుకోవాలి. ఒక గంట పాటు ఉంచుకుకున్న తర్వాత తలస్నానం చేయాలి. ఇది చుండ్రును తొలగించటంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.

నేటి మంచి మాట

భలహీనులే  ప్రతీకారంతో ఆపదలను కొనితెచ్చుకుంటాడు.భలవంతులు మౌనంగా సహిస్తారు. బుదిమంతులు మాత్రమె జరిగిన సంఘటన మరచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు .

క్రీడలు
క్రికెట్ గ్రౌండ్ల ను ప్రారంభించిన కార్పొరేషన్ మేయర్

బాలపూర్, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : కార్పొరేషన్ మేయర్ చిగురుంత పారిజాత నరసింహారెడ్డి క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ సుల్తాన్ పూర్ లోనీ ఏ బి ఆర్ ఆర్- I, ii, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుక్రవారం నాడు క్రికెట్ గ్రౌండ్స్ ని ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.... క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, సహకార బ్యాంక్ డైరక్టర్ ఎన్ను శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ ఎస్ నాయకులు బొర్ర జగన్ రెడ్డి, ఏన్ను జగన్ రెడ్డి, ఎన్ను మహిపాల్ రెడ్డి, ఎన్ను శ్రీనివాస్ రెడ్డి, రామిడి మల్లారెడ్డి, ఏనుగు యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ యువత క్రీడలలో రాణించాలి : ఎంపీపీ అరిగెల మల్లికార్జున్

ఆసిఫాబాద్ జిల్లా మార్చి15 (ప్రజాపాలన, ప్రతినిధి) : గ్రామీణ యువత క్రీడలలో రాణించాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ అన్నారు. గురువారం మండలంలోని రౌట సంకేపల్లి, పర్శ నంబాల, గ్రామాలలో పర్యటించి, పర్శ నంబాల లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామీణ యువత చదువులతో పాటు క్రీడలలో కూడా రాణించి, మండలానికి మంచి పేరు తేవాలన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసుకు రావాలన్నారు. అలాగే పర్శనంబాల నుండి రౌట గ్రామం వరకు చేస్తున్న గ్రావెల్ రోడ్డు ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, నాయకులు కృష్ణయ్య, గ్రామ ప్రజలు ఉన్నారు.

రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక

వెల్గటూర్, మార్చి 24, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం గుల్లకోట ఉన్నత పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు బి.పూజిత, ఏ.నవ్య, వి.గాయత్రి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పి.ఈ.టి జి. శ్రీను బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు ఈ నెల 10వ తేదీన ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సెలక్షన్ లో జూనియర్స్ బాలికల విభాగంలో ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు.వీరు ఈనెల 25 నుండి  27 వరకు మహబూబ్ నగర్ లో జరిగే బోయే రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల విభాగంలో పాల్గొంటారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. శారద, ఎస్.ఎం.సి చైర్మన్ కాటు ఎలిష, సర్పంచ్ స్వరూప తిరుపతి గౌడ్,ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎం.పీ.టీ.సీ గొల్లపల్లి శ్రీజ మల్లేష్ గౌడ్, తె.రా.స మండల శాఖ ప్రధాన కార్యదర్శి సింహాచలం జగన్ టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాస రావు ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజలు, సీనియర్ క్రీడాకారులు భాష మహేష్, జైనాపురం సాయి, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణ్  అభినందించారు.

Sneha Group of Organizations