శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ జీర్ణోదరణ సంప్రోక్షణ ఉత్సవం...

Published: Wednesday March 24, 2021
బీరుపూర్, మర్చి 23 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం మంగేల గ్రామంలోని అతి పురాతన చరిత్ర కలిగిన దేవాలయం శీతిలవస్థ అయిన సంగతి తెలిసిందే. గ్రామ సర్పంచ్ సుంచు శారదనరేందర్ వైస్ ఎంపీపీ బలుమురి లక్ష్మణ్ రావు గ్రామ ప్రజలు దేవాలయంపై దృష్టిపెట్టి చందాలు పోగుచేసి పూర్వవైభోగం తీసుకురావలనే సంకల్పంతో మంగళవారం రోజున రామలింగేశ్వర స్వామి ఆలయ జీర్ణోదరణ సంప్రోక్షణ ఉత్సవాన్నీ పురోహిత పండితులు వేదం మంత్రాల సాక్షిగా ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కొబ్బరికాయలు పూలు పండ్లు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 7 గంటలకు శివపార్వతుల విగ్రహాల శోభయాత్ర 8:30 గం: నిలకు గోదావరి మాతకు వాయనం సమర్పించడం 9:30 గం: నిలకు వేద బ్రహ్మణులచే పురాతన దేవాలయంకు గోదావరి జలంచే సంప్రోక్షణ 11:45 గం ని: లకు శివపార్వతుల కళ్యాణము ఘనంగా నిర్వహించిన అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి పాత పద్మారమేష్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.