ఘనంగా ముగిసిన విజయ కనకదుర్గ ఆలయ వార్షికోత్సవ వేడుకలు

Published: Wednesday March 24, 2021
అమీర్ పేట్ జోన్(ప్రజాపాలన ప్రతినిధి) : కే పి హెచ్ బి కాలనిలోని విజయ కనకదుర్గ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి అని ఆలయ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కనక దుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా గత మూడు రోజులుగా ఆలయ ప్రధాన అర్చకులు యుగంధర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవ వేడుకలు సోమవారంతో ముగిసాయని తెలిపారు. ఈ మూడు రోజులపాటు జరిగిన ఉత్సవాలలో నగరం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తులు కనకదుర్గ అమ్మవారి విగ్రహానికి కాసుల పెరు, వెండి కానుకలు బహుమతి అందజేశారు. ఈ మూడు రోజులలో లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం, మహా పూర్ణాహుతి, వంటి కార్యక్రమాలు నిర్వహించి చివరి రోజున అన్న సమారాదన నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామస్వామి, రామారావు, వాసు, విష్ణు, సోమేశ్, సుధాకర్, పద్మశ్రీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.