ముద్దాపురంలో ఘనంగా తిరుకళ్యాణ మహోత్సవం

Published: Saturday March 20, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని ముద్దాపురం గ్రామంలో గల శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా వేదపండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు వాకిటి శ్రీనివాస్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ నాయిని కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ పెద్దిరెడ్డి ఉప్పల్ రెడ్డి, ఎంపిటిసి సామ రాంరెడ్డి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ వాకిటి అనంతరెడ్డి, కమిటీ వైస్ చైర్మన్ సామ చిననర్సిరెడ్డి, నాయకులు పినింటి కృష్ణారెడ్డి, వాకిటి గంగిరెడ్డి, ధర్మారెడ్డి, అంజయ్య, ఆలయ కమిటీ ధర్మకర్తలు, అర్చకులు డింగరి శేషాచార్యులు, ఫణి కుమార్ ఆచార్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.