పుష్కరఘాట్‌లో వేద పండితులకు సత్కారం

Published: Friday July 01, 2016

రాజమహేంద్రవరం, జూలై 1 : బుద్ధవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌, దేవాదాయ, ధర్మాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదావరి నిత్య హారతి కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా పుష్కరఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. గోదావరి నిత్య హారతి నిర్వహిస్తున్న పండితుల సారధ్యంలో అమ్మవారికి 108 కలశాల పంచామృత సహిత, గోదావరి జలములతో అభిషేకం, మండపారాధన, లలిత సహస్రపూర్వక కుంకుమార్చన జరిపించారు. బ్రహ్మశ్రీలు ఇంద్రగంటి సోమయాజులు, ఇంద్రగంటి గోపాలశర్మలను నిత్య హారతి పండితులు ఘనంగా సత్కరించారు. బుద్ధవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌ ట్రస్టీలు ఎస్‌.ఎన్‌.రాజా, ప్రసాదుల హరినాధ్‌, పంతం కొండలరావు, దేవాదాయ, ధర్మాదాయశాఖాధికారి తారకేశ్వరరావు, గోదావరిమాత అర్చకులు ఫణిశర్మలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిత్య హారతి పండితులు మణికంఠ శర్మ, ఆదిత్య శర్మ, బుద్ధవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు పూడి ప్రకాష్‌, ఆశపు మల్లిబాబు, ప్రీతమ్‌ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు.